ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Says India Will Have Chief Of Defence Staff   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక ప్రకటన చేశారు. త్రివిధ దళాధిపతిగా డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌ వ్యవహరిస్తారని వెల్లడించారు. మన సేనలు దేశానికి గర్వకారణమని, ఎర్రకోట నుంచి తాను కీలక నిర్ణయం వెల్లడిస్తున్నానంటూ దేశానికి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) రానున్నారని స్పష్టం చేశారు.

ఈ నియామకంతో మన సేనలు మరింత పటిష్టవంతమైన సేవలు అందిస్తాయని అన్నారు. సర్వీస్‌ చీఫ్‌లకు సీడీఎస్‌ సీనియర్‌గా వ్యవహరిస్తారని సాయుధ దళాలు, ప్రధానికి మధ్య సీడీఎస్‌ వారధిలా ఉంటారని చెప్పారు. ప్రస్తుత సైనిక వ్యవస్థలో త్రివిధ దళాల చీఫ్‌ల కమిటీ చైర్మన్‌గా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీరేందర్‌ సింగ్‌ దనోవా ఉండగా ఆయన సీడీఎస్‌ హోదాలో పనిచేయడం లేదు. కాగా సీడీఎస్‌ నియామకంపై ప్రధాని ప్రకటనను కార్గిల్‌ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన వేద్‌ ప్రకాష్‌ మాలిక్‌ స్వాగతించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top