సింగపూర్‌ చూపుతున్న మార్గం | Singapore How Fight On Terrorism | Sakshi
Sakshi News home page

సింగపూర్‌ చూపుతున్న మార్గం

Dec 2 2025 12:31 AM | Updated on Dec 2 2025 12:31 AM

ఢిల్లీలో ఎర్రకోట వద్ద నవంబర్‌ 10న జరిగిన ఉగ్ర దాడి, భారత్‌ ఎదుర్కొంటున్న ఆంతరంగిక భద్రతా సవాళ్ళపైకి మరోసారి దృష్టిని మరల్చింది. ఈ దాడిలో 13 మంది చనిపోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఢిల్లీలో హైకోర్టు వద్ద 2011లో జరిగిన బాంబు పేలుడు తర్వాత, అంతటి భీతావహమైన దాడి చోటుచేసుకోవడం మళ్లీ ఇదే మొదటిసారి. ముంబయిలో 2008 నవంబర్‌ 26న భారత్‌ పెద్ద ఉగ్ర దాడిని చవిచూసింది. ఆ దాడిలో పాల్గొన్నవారిలో ఒకడైన కసబ్‌కు పాకిస్తాన్‌తో ఉన్న సంబంధం స్పష్టంగా వెల్లడైంది. 

వైట్‌ కాలర్‌ ఉగ్రవాదం
అయితే, ఢిల్లీ ఘటన ఇస్లామీయ ర్యాడికలైజేషన్‌లో వచ్చిన పెద్ద మార్పునకు అద్దం పడుతోందని చెబుతున్నారు. అది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పాకింది. వృత్తి నిపుణులు (ఈ కేసులో డాక్టర్లు) తమకు తాము ఉగ్రవాదులుగా మారుతున్నారు. వారు డిజిటల్‌ సాధనాలను, సంస్థాపరమైన సౌలభ్యాన్ని వినియో గించుకుంటున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తదనంతర దర్యాప్తులో అనేక సంగతులు వెల్లడయ్యాయి. ఊహకందని ఉగ్ర సాలెగూడు జమ్ము–కశ్మీర్, హరియాణా, ఉత్తర ప్రదేశ్‌లను మించి విస్తరించినట్లు తేలింది. ఒక వైట్‌–కాలర్‌ ఉగ్ర వ్యవస్థ బయటపడింది. దానికి పాకిస్తాన్‌లోని జైష్‌–ఏ–మహమ్మద్‌ (జెమ్‌), అన్సార్‌ గజవత్‌ ఉల్‌– హింద్‌తో సంబంధాలున్నాయి. వారు అనుసరించిన ఎత్తుగడలు హమాస్‌ నుంచి స్ఫూర్తి పొందినవిగా కనిపిస్తున్నాయని కూడా ప్రాథ మిక నివేదికలు సూచించాయి. 

విదేశీ సూత్రధారుల (ఉదాహరణకు తుర్కియేలోని ‘ఉకాస’) ఆదేశాలను పాటించినట్లు కూడా వెల్లడవు తోంది. దానికి వారు సెషన్, టెలిగ్రామ్‌ వంటి యాప్‌లను వాడు కున్నారు. సోదాలలో 2,900 కిలోల పేలుడు పదార్థాలు, డిటొ నేటర్లు, అసాల్ట్‌ రైఫిళ్ళు, (42 వీడియోలతో సహా) ప్రాపగాండా సామగ్రి దొరికాయి. ‘జెమ్‌’ వంటి ఉగ్ర తండాలు, వాటి అనుబంధ వర్గాలు స్లీపర్‌ సెల్స్‌ సృష్టించేందుకు, విద్యావంతులైన యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, అందుకు సామాజిక మాధ్యమా లను వాడుకుంటున్నాయని తేటతెల్లమైంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ఉన్న అస్థిర పరిస్థితులు, అశాంతి ఈ వ్యవహారాలలో ఒక వారధిగా పనిచేయడానికి అవకాశం కల్పించి ఉండవచ్చునని కూడా అను మానిస్తున్నారు.

సింగపూర్‌కూ తప్పని సంకటం
ఇటీవలి నా సింగపూర్‌ సందర్శన సందర్భంగా నాకు కొన్ని నిగూఢమైన అంశాలు తెలిసి వచ్చాయి. సోషల్‌ మీడియా, ఆర్టిఫిషి యల్‌ ఇంటెలిజె¯Œ ్స ఆధారిత ఇస్లామీయ ర్యాడికలైజేషన్‌ విసురు తున్న సవాల్, అది ఆ నగర రాజ్యంలోని యువ వర్గాలపై చూపు తున్న ప్రభావం దిగ్భ్రమకు గురిచేశాయి.
సెక్యూరిటీ ఏజెన్సీలు నిర్భంధంలోకి తీసుకుంటున్న యువ ర్యాడికల్‌ సింగపూరియన్ల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోందని మరిన్ని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

సెక్యూరిటీ ఏజెన్సీలు జాగు చేయకుండా వెంటనే నివారణ చర్యలకు దిగడం వల్ల చాలా ప్రమాదకర ఘటనలు తప్పిపోయాయి. సింగపూర్‌లో తుపాకీ నిరోధక చట్టాలు పకడ్బందీగా అమలవుతున్నాయి. వాటిని తప్పించుకుని ఒక ఆయుధాన్ని తయారు చేసేందుకు, 17 ఏళ్ళ ఓ యువకుడు 3–డి ప్రింటింగ్‌ను వినియోగించుకునే ప్రణాళికలో ఉన్నాడు. కానీ, ఆంతరంగిక భద్రతా విభాగం (ఐఎస్డీ) ఈ ఏడాది మార్చిలో అతడిని నిర్బంధంలోకి తీసుకోగలిగింది. అతడి నుంచి రాబట్టిన విషయాలు మరింత ఆశ్చర్యం గొలిపాయి. అతడు ఆ ఆయుధాన్ని ఉపయోగించి స్థానిక మసీదు ఒక దానిలో కనీసం 100 మందిని చంపేసి, తనను తాను కాల్చుకుని చనిపోయే ఆలోచనలో ఉన్నాడు. 

దీనికి ముందు, ఫిబ్రవరి నెలలో, ఐఎస్డీకి ఓ 15 ఏళ్ళ అమ్మాయిపై అనుమానం కలిగింది. ఆమె కదలికలపై నిఘా పెట్టి, తర్వాత నిర్భంధంలోకి తీసుకుంది. ఆంతరంగిక భద్రతా చట్టం కింద సింగపూర్‌లో ఓ అమ్మాయిని అరెస్టు చేయడం అదే మొదటి సారి. ఆమె ‘ఐసిస్‌’ సభ్యుడిని పెళ్ళి చేసుకుని, దానికి అనుకూ లమైన కుటుంబాన్ని పెంచాలని భావిస్తోంది. సిరియాలో పోరాటంలోకి దిగి, అమర వీరురాలిగా మారాలని కలలు గంటోంది.  

అరికట్టే చర్యలు 
ఈ పెడ ధోరణులకు అడ్డుకట్ట వేసేందుకు సింగపూర్‌ ప్రభుత్వం రెలిజియస్‌ రీహ్యాబిలిటేషన్‌ గ్రూప్‌ (ఆర్‌.ఆర్‌.జి.) పేరుతో 2005లోనే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవస్థీకృత ఉగ్ర తండాల సభ్యుల నుంచి పొంచి ఉన్న బెడదను ఎదుర్కోవడాన్ని అది మొదట లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా జెమా ఇస్లామియా (జేఐ) నుంచి ఉన్న ముప్పును నివారించే పనిలోపడింది. కాలక్రమంలో పరిస్థితులకు తగ్గట్లుగా ఆర్‌.ఆర్‌.జి. తన కార్యాచరణను మార్చుకుంటూ వచ్చింది. అసలు మతం ఉద్దేశాలు, ఆశయాల గురించి యువతకు సక్రమ అవగాహన కల్పించే పనిని ప్రశంసనీయమైన రీతిలో కొనసాగిస్తూ వచ్చింది. 

యువతలో కొందరు ఆవేశం, నిరాశా నిస్పృహలతో హింసకు దిగడాన్ని గమనించి అది పరిష్కారం కాదని పరివర్తనకు దారి చూపింది. అది సత్ఫలితాలను ఇచ్చినట్లు ఒక విస్తృత సర్వేలో తేలింది. సింగపూర్‌ ఐ.ఎస్‌.ఏ. కింద Výæడచిన దశాబ్దంలో కేవలం 17 మంది మాత్రమే అరెస్టు అయ్యారు. ముఖ్యంగా, ఆ నగర రాజ్యంలో పెద్ద ఉగ్ర ఘటన ఏదీ చోటుచేసుకోలేదు. అయితే, సింగపూర్‌ ముస్లిం వ్యవహారాల మంత్రి ప్రొఫెసర్‌ ఫైజల్‌ ఇబ్రహీం తాజా ర్యాడికలై జేషన్‌ను గమనించకపోలేదు. ‘‘దేశాల మధ్య అనుసంధానకత్వం పెరిగిపోతున్న ప్రపంచంలో ఉగ్ర సామగ్రి తేలిగ్గా అందుబాటులోకి వస్తోంది. డిజిటల్‌ సాధనాలలో సైద్ధాంతిక ప్రబోధాలు ప్రతిధ్వని స్తున్నాయి. యువత ఇంటర్‌నెట్‌లోనే ఎక్కువ సమయం గడుపు తూండటం వల్ల ర్యాడికలైజేషన్‌కు వెసులుబాటు ఏర్పడడమే కాక, ఆ ప్రక్రియ వేగం పెరుగుతోంది’’ అన్నారు.

అయితే, భారతదేశాన్ని ఆ నగర రాజ్యంతో పోల్చుకోలేం. సింగపూర్‌ జనాభా అరవై లక్షలు మాత్రమే. భారత్‌ జనాభా ఇంచు మించు 150 కోట్లు. వైవిధ్యంతో కూడిన భారతీయులు దాదాపు 800 జిల్లాలలో విస్తరించి ఉన్నారు. వివిధ మతాలు, భాషలు, కులాలకు చెందిన వారి సామాజిక–సాంస్కృతిక మిశ్రమత్వం మరింత జటిలమైంది. కానీ టెక్నాలజీ, సోషల్‌ మీడియా, ఏఐ ఆధారిత ర్యాడికలైజేషన్‌ తీరుతెన్నులకు సరిహద్దులు లేవు. సింగ పూర్‌ ఆర్‌.ఆర్‌.జి. నమూనాను సమీక్షించి, భారతదేశానికి తగ్గ విరుగుడు కార్యక్రమాలను రూపొందించుకోవచ్చు.


సి. ఉదయ్‌ భాస్కర్‌ 
వ్యాసకర్త ‘సొసైటీ ఫర్‌ పాలసీ స్టడీస్‌’ డైరెక్టర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement