ఢిల్లీ ఎర్రకోట బాంబుదాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తులో ఉగ్రవాదుల కుట్రకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోని లాకర్లను ఆయుధాలు, ఇతర మందుగుండు సామాగ్రిని భద్రపరిచేందుకు టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లుగా ఎన్ఐఏ విచారణలో తేలింది. సరిగ్గా గాజాలో హమాస్ ఈ విధంగానే జరిగిందని ఒక వేళ ఈ ఉగ్రవాదులకు హామాస్‌తో లింకులున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తుంది.
ఆసుపత్రులంటే ఎంతో మందికి ప్రాణాలు పోసే దేవాలయాలు. అటువంటి వైద్యశాలలను ఉగ్రవాదులు సంఘ విద్రోహా చర్యలకు కేంద్రస్థానంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఎర్రకోట బాంబు దాడిలో అరెస్టైన మహమ్మద్ షకీల్ జమ్మూకశ్మీర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తారు. అతను అరెస్టైన అనంతరం షకీల్ విధులు నిర్వహించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ఐఏ బలగాలు సోదాలు చేశాయి. ఆ ఆసుపత్రి లాకర్‌లో ఒక ఏకే-47 మిషన్ గన్‌తో పాటు మందుగుండు సామాగ్రి లభ్యమయ్యాయి. ఈ విషయంపై మరింత లోతుగా ఎన్ఐఏ విచారణ చేపట్టింది.
దీంతో అనంత్ నాగ్, బారముల్లా, బుడ్గాం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆయుధాలు నిల్వ చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఆసుపత్రులలో మారణాయుధాలు దాచిపెడతే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశ్యంతో ఈ ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ప్రణాళిక గాజాలో హామాస్ చేసిందని దానిని వీరు కాఫీకొట్టారా లేదా ఆ ఉగ్రవాద సంస్థతో ఇక్కడి ఉగ్రవాదులకు సంబంధాలున్నాయా అనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది
గాజాలో హమాస్ ఆల్ షిపా అనే ఆసుపత్రి కింద తన స్థావరాన్ని నిర్మించింది. దీనిని ఇజ్రాయిల్ సైన్యాలు గుర్తించగా అందులో పెద్దఎత్తున ఆయుధాలు బయిటపడ్డాయి.ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లోనూ ఉగ్రవాదులు ఆసుపత్రులను ఆయుధాలు దాచడానికి వాడాలని ప్రయత్నించడంతో ఎన్ఐఏ వారి సంబంధాలపై అనుమానం వ్యక్తం చేస్తుంది.


