ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనకు భద్రతా బలగాలు ప్రతిస్పందనకు దిగాయి. ప్రధాన నిందితుడు ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ ఉన్ నబీ ఇంటిని నాశనం చేశాయి. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో ఉన్న అతని ఇంటిని ఈ వేకువ జామున పేలుడు పదార్థాలతో నేలమట్టం చేశాయి.
పరిదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్సిటీలో వైద్యుడిగా పని చేస్తున్న ఉమర్.. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. నేతాజీ సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద హ్యుండాయ్ ఐ20 కారుతో జరిపిన పేలుడులో 13 మంది అమాయకులు ప్రాణాలు వదిలారు. మరో 20 మందికి గాయలయ్యాయి. అయితే..
గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వేకువ జామున ఉమర్ ఇంటిని కూల్చే ప్రక్రియ కొనసాగింది. ఐఈడీ సాయంతో నియంత్రిత పద్ధతిలో ఇంటిని పేల్చేశాయి భద్రతా బలగాలు. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే వారికి హెచ్చరికగా ఉండాలనే ఈ పని చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంతకు ముందు.. పహల్గాం ఉగ్రదాడి కుట్రలో పాల్గొన్నవారిపై కూడా బుల్డోజర్ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇక ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో ఉమర్ అవశేషాల డీఎన్‌ఏ పరీక్షలతో నిర్ధారించారు. ఈ దాడి జరగడానికి కొన్ని గంటల ముందే భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సుమారు 2,900 కిలోల పేలుడు పదార్థాలు, ఆధునిక ఆయుధాలను జమ్ము కశ్మీర్-ఫరీదాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్, హైదరాబాద్.. ఇలా దేశంలోని పలు నగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేసినట్లు తేలింది. ముజమ్మిల్, షాహీన్ సయీద్ అనే వైద్యుల వద్ద నుంచి ఇవి లభించాయి. వీళ్లిద్దరూ ఉమర్‌కు సహచరులుగా తేలింది. అంతేకాదు.. ఢిల్లీ పేలుడు ఘటన కేసు దర్యాప్తులోనూ విస్తూపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
🚨 #BREAKING: Security forces in Pulwama, South Kashmir, have demolished the house of Umar Nabi, the car bomber behind the Delhi terror attack linked to Jaish-e-Mohammed’s Doctor Module. A strong message from India against terrorism. 🇮🇳 #AntiTerrorOperation #Pulwama pic.twitter.com/XjIrOfxDlx
— UNKNOWN | 🇮🇳 | | | 𝕏 | (@BhagatSingh_07) November 14, 2025


