breaking news
Delhi Red Fort Blast
-
ఢిల్లీలో పేలుడు.. ఏపీలో హైఅలర్ట్
సాక్షి, అమరావతి: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, చిత్తూరు, బెంగళూరు సరిహద్దులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. టూరిస్ట్ స్పాట్లలోని లాడ్జిలలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కొత్తగా ఆయా ప్రాంతాల్లోకి వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. -
ఢిల్లీ పేలుడు.. ఘటనా స్థలానికి అమిత్‌షా
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో 10మంది మృతి చెందారు. 20మందికి పైగా గాయపడ్డారు. అయితే, పేలుడు ఘటనలో గాయాల పాలై స్థానిక ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పరామర్శించారు. అనంతరం బాంబు పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లనుళ్లనున్నారు.అంతకుముందు ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. సాయంత్రం 7గం. సమయంలో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఘటన జరిగింది. హుండాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలువురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పది నిమిషాల్లో అధికారులు ఘటనా స్థలిలోకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారుపేలుడుపై విచారణ జరుగుతోంది. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ దర్యాప్తు చేస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే నేను ఘటనా స్థలానికి వెళ్తాను.. క్షతగాత్రులను పరామర్శిస్తాను’అని వ్యాఖ్యానించారు. #WATCH | Delhi: Blast near Red Fort Metro Station | Union Home Minister Amit Shah meets the people injured in the blast, at Lok Nayak Hospital. pic.twitter.com/IMPj2c77rv— ANI (@ANI) November 10, 2025 -
ఢిల్లీ బాంబు పేలుడు: జీపీఎస్ స్పూఫింగ్ అందుకేనా?
ఇటీవల ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)లో సమస్యలతో వందకు పైగా విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం కనిపించిన విషయం తెలిసిందే..! ఇందుకు కారణం.. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) సిగ్నల్స్ స్పూఫింగ్ జరగడమేనని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేసినా.. అధికారికంగా ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే.. తాజా ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో కొన్ని రోజులుగా భారత కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు జీపీఎస్ స్పూఫింగ్ చేసి ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కుట్ర కోణంపై ఉప్పందండంతో..నిజానికి 10 రోజులుగా దేశంలో ఏదో ఒక చోట ఉగ్రవాదులు అరెస్టవుతున్నారు. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఆపరేటివ్‌లు, లష్కరే తాయిబా ఉగ్రవాదులు, సానుభూతిపరులు పట్టుబడుతున్నారు. జమ్మూకశ్మీర్, హర్యానాల్లో ఏకంగా 300 ఆర్డీఎక్స్, 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. దీన్ని బట్టి.. ఉగ్రవాద చర్యలపై ముందుగానే నిఘా వర్గాలకు ఉప్పందింది. ఆ కుట్రలను భగ్నం చేసేందుకే జీపీఎస్ స్పూఫింగ్ చేపట్టారు. ఈ కారణంగానే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. అయితే.. బాంబు పేలుళ్లకు యత్నించే ఉగ్ర మూకలకు సైతం జీపీఎస్ స్పూఫింగ్ కారణంగా తమ టార్గెట్ లొకేషన్‌ను ఎంచుకోవడంలో అడ్డుకట్ట వేసినట్లవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జీపీఎస్ స్పూఫింగ్ సాధ్యమేనా?సాధారణంగా హ్యాకర్లకు శాటిలైట్ ఆధారిత జీపీఎస్ సిగ్నళ్లను స్పూఫ్ చేయడం దాదాపుగా అసాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే.. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్(సీఐ సెల్), భారత నిఘా సంస్థ(ఐబీ), మిలటరీ ఇంటెలిజెన్స్ వంటి సంస్థలు జీపీఎస్ స్పూఫింగ్ చేసే అవకాశాలున్నాయి. శత్రుడ డ్రోన్లు, నిఘా విమానాలను తప్పుదోవ పట్టించేందుకు, వాటిని దాడుల నుంచి నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకుంటారు. ముఖ్యమైన ప్రదేశాలను ‘హార్డ్డెన్’ (రక్షణ) కల్పించేందుకు రియల్ టైమ్ మాస్క్ వేస్తారని సమాచారం. ఢిల్లీ విమానాశ్రయం కూడా అత్యంత కీలకమైనది కావడంతో.. రన్‌వే నుంచి సుమారు 60 నాటికల్ మైళ్ల పరిధి వరకు జీపీఎస్ స్పూఫింగ్ ప్రభావం కనిపించింది. సాధారణంగా ఇంతటి పరిధిలో స్పూఫింగ్ జరగడం చాలా అరుదు. యుద్ధాల సమయంలోనే ఇలా స్పూఫింగ్ చేస్తుంటారని తెలుస్తోంది. శత్రు దాడుల నుంచి రక్షణ రంగ సంస్థలను కాపాడేందుకు కూడా ఓపెన్ సోర్స్ ట్రాప్ పేరుతో జీపీఎస్ స్పూఫింగ్ చేస్తారని తెలుస్తోంది. ఎలా చేస్తారు?జీపీఎఫ్ స్పూఫింగ్‌కు రెండు మార్గాలను నిఘావర్గాలు ఎంచుకుంటాయని సమాచారం. వాటిల్లో మొదటిది జామింగ్(blocking) కాగా.. రెండోది జీపీఎస్ స్పూఫింగ్. మొదటి దాంట్లో జీపీఎస్ రిసీవర్‌కు ఉపగ్రహ సిగ్నళ్లను బ్లాక్(no fix) చేస్తారు. రెండో పద్ధతిలో ఫేక్ సిగ్నల్స్‌ని పంపుతారు. అంటే.. అసలైన జీపీఎస్ లొకేషన్ కాకుండా.. ఫేక్ లొకేషన్ కనిపిస్తుంది. ఇలా స్పూఫింగ్ చేయడానికి మిలటరీ గ్రేడ్ ప్రీక్వెన్సీ- ఈడబ్ల్యూ ట్రాన్స్మిటర్లు అవసరమని రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్ఎఫ్) ఇంజనీర్లు చెబుతున్నారు. -
ఢిల్లీ పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఢిల్లీ ఎర్రకోట దగ్గర భారీ పేలుడు ఘటనతో దేశం మొత్తం ఉలిక్కి పడింది. పేలుడు ధాటికి 10 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ‘‘ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన. Deeply shocked and saddened to learn about the massive explosion near Red Fort Metro Station in Delhi. My heart goes out to the families who lost their loved ones in this strongly condemnable incident.Praying for a speedy recovery of all those injured in this ghastly tragedy.— YS Jagan Mohan Reddy (@ysjagan) November 10, 2025 సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద భారీ పేలుడు సంభవించింది. తొలుత పార్క్ చేసి ఉన్న కారు పేలి ఈ ఘోరం సంభవించిందని అంతా భావించారు. అయితే 6.52గం. ప్రాంతంలో పేలుడు సంభవించిందని, రెడ్‌సిగ్నల్ వద్ద కారు నెమ్మదిగా ఆగి ఆగుతుండగానే పేలిందని, ఆ సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. పేలుడుకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు తర్వాతే స్పష్టమైన ప్రకటన చేస్తామని అన్నారు.


