సాక్షి, తాడేపల్లి: ఢిల్లీ ఎర్రకోట దగ్గర భారీ పేలుడు ఘటనతో దేశం మొత్తం ఉలిక్కి పడింది. పేలుడు ధాటికి 10 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
‘‘ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన.
Deeply shocked and saddened to learn about the massive explosion near Red Fort Metro Station in Delhi. My heart goes out to the families who lost their loved ones in this strongly condemnable incident.
Praying for a speedy recovery of all those injured in this ghastly tragedy.— YS Jagan Mohan Reddy (@ysjagan) November 10, 2025
సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద భారీ పేలుడు సంభవించింది. తొలుత పార్క్ చేసి ఉన్న కారు పేలి ఈ ఘోరం సంభవించిందని అంతా భావించారు. అయితే 6.52గం. ప్రాంతంలో పేలుడు సంభవించిందని, రెడ్‌సిగ్నల్ వద్ద కారు నెమ్మదిగా ఆగి ఆగుతుండగానే పేలిందని, ఆ సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. పేలుడుకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు తర్వాతే స్పష్టమైన ప్రకటన చేస్తామని అన్నారు.


