సాక్షి, తిరుమల: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల తాకిడి పెరగడంతో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లను టీటీడీ రద్దు చేసింది. ఆన్‌లైన్ శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా దర్శనం కొనసాగుతోంది. రద్దీ కారణంగా నిన్న అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద తోపులాట జరిగిన విషయం తెలిసిందే.

ఇక, తిరుమల శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లు అన్నీ నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 8 గంటలు సమయం పడుతోంది. నిన్న(గురువారం) శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే 37,154 మంది భక్తులు తల నీలాలు అర్పించారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 4.12 కోట్లుగా ఉంది.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


