శివైక్యం చెందిన బ్రహ్మయ్య గురూజీ
బాపట్ల: ఆంజనేయస్వామి ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఎందరో ప్రముఖులకు మార్గదర్శి అయిన బ్రహ్మయ్య గురూజీ(79) శివైక్యం చెందారు. బాపట్ల కేంద్రంగా గత 25 సంవత్సరాలుగా హనుమ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులకు, ఆశీర్వాదాలు అందజేస్తూ బ్రహ్మయ్య గురూజీ ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నారు. ఆయన మరణ వార్త తెలుసుకొని పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం ఆయన అంత్యక్రియల్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, శిష్యులు, బంధువుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. భవిష్యత్తులో బ్రహ్మయ్య గురూజీ స్మృతి వనం ఏర్పాటు చేసి, గడిచిన 25 సంవత్సరాలుగా ఆయన ప్రజలకు అందించిన ఆధ్యాత్మిక పరిమళాలను కొనసాగించేలా కార్యక్రమాల రూపకల్పన చేసేందుకు శిష్యులు సిద్ధమవుతున్నారు. అంతిమయాత్రలో ఆడిటర్ పుప్పాల చిన్న సాయిబాబు, బొమ్మిశెట్టి వెంకటరత్న గుప్తా, కొత్తమాసు సత్యనారాయణ, న్యాయవాది అలపర్తి నాగేశ్వరరావు, అలపర్తి శ్రీనివాసరావు, సామాజికవేత్త చింతకాయల పార్థసారథి, పెదమల్లు ఉదయ్ చందర్రావు, మూర్తి, పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని నివాళులర్పించారు.


