క్రిస్మస్ ప్రార్థనల్లో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర
ప్రత్తిపాడు: పెదనందిపాడులోని ఆంధ్ర ఇవాంజెలికల్ లూథరన్ చర్చిలో గురువారం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఫాదర్లు ప్రార్థనల అనంతరం క్రీస్తు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా లావు నాగేశ్వరావు సంఘ పెద్దలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అంటే ప్రేమ, కరుణకు ప్రతీక అని చెప్పారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


