సాక్షి, గుంటూరు: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే నిలిపిన కారును ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వివరాల మేరకు.. గుంటూరు జిల్లాలోని నల్లపాడు స్టేషన్ పరిధి అంకిరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. కాగా, మృతులను తెలంగాణలోని నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం తర్వాత మృతదేహాలను జీజీహెచ్‌కు తరలించినట్టు నల్లపాడు పోలీసులు తెలిపారు.



