ఢిల్లీ పేలుడు ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ విషాద సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలో బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పోస్ట్ చేశారు. మళ్లీ ఎప్పటిలాగే శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాని ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. కాగా..ఈ కారు పేలుడు ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది.
కాగా.. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే పుష్ప-2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న వస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రస్తుతం AA22XA6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
Deeply saddened by the tragic incident near Delhi's Red Fort. My heartfelt prayers are with the victims and their families, and I wish for peace to prevail once again. 🙏🏼 🇮🇳
— Allu Arjun (@alluarjun) November 11, 2025


