యశవంతపుర(బెంగళూరు): కల్యాణం.. కమనీయం అన్నారు. కానీ ఘోర విషాదంగా పరిణమించింది. పట్టుమని 2 నెలలు కూడా కాపురం చేయని నవ వధూవరులు ఆత్మహత్యలతో పరలోకానికి చేరారు. ఈ ఘోరం బెంగళూరులోనే జరిగింది. నవవివాహిత గానవి (26) ఆత్మహత్యాయత్నం, మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది. భార్యను వేధించాడని, నపుంసకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త సూరజ్ మహారాష్ట్ర నాగపూర్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అది తెలిసి సూరజ్ తల్లి జయంతి కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
అట్టహాసంగా పెళ్లయితే..
గానవి, సూరజ్ (30)లకు అక్టోబర్ 29న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో అట్టహాసంగా వివాహమైంది. 12 రోజుల కిందట శ్రీలంకకు హనీమూన్‌కు వెళ్లారు. కానీ అక్కడ ఇద్దరి మధ్య పోట్లాటలు జరిగి మధ్యలోనే ముగించుకొని బెంగళూరుకు వచ్చేశారు. మీ కూతురిని తీసుకెళ్లాలని ఆమె తల్లిదండ్రులకు సూరజ్ ఫోన్ చేసి చెప్పాడు. ఈ గొడవలతో 24న గానవి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రిలో 26న చనిపోయింది.
నాగపూర్‌కు వెళ్లిపోయి..
గానవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సూరజ్ కుటుంబంపై పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యాయత్నం అభియోగాలతో రామమూర్తినగర పోలీసులు కేసును నమోదు చేశారు. అరెస్టు భయంతో సూరజ్, తల్లి జయంతి, సోదరుడు సంజయ్ నాగపూర్‌కు పరారయ్యారు. శనివారం అక్కడే ఓ విల్లాలో సూరజ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి జయంతి కూడా ఆస్పతిర్లో చికిత్స పొందుతోంది. ఈ మేరకు స్థానిక సోనేగావ్ పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారమిచ్చారు.
గానవి తల్లి ఏమన్నారు?
సూరజ్ ఆత్మహత్యకు అతని తప్పుడు భావనలే కారణమని గానవి తల్లి ఆరోపించింది. నెలన్నర పాటు సూరజ్ సంసారం చేయలేదు, భార్య పక్కన కూర్చుని భోజనం కూడా చేసేవాడు కాదు. భర్త, అత్తల ప్రేమ కోసం గానవి ఎంతో ప్రయతి్నంచింది, పుట్టింటికీ వెళ్లను ఇక్కడ ఉండి బతుకుతా, నాకు ప్రేమను పంచండి అని గానవి భర్త, అత్తతో మొరపెట్టుకుంది. కానీ పుట్టింటికి వెళ్లిపో అని ఒత్తిడి చేశారు. తప్పుడు ఆలోచనలు, గానవి శాపమే సూరజ్ ఆత్మహత్యకు కారణం అని దుయ్యబట్టారు.
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు


