సాక్షి, అమరావతి: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, చిత్తూరు, బెంగళూరు సరిహద్దులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. టూరిస్ట్ స్పాట్‌లలోని లాడ్జిలలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కొత్తగా ఆయా ప్రాంతాల్లోకి వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.




