సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో 10మంది మృతి చెందారు. 20మందికి పైగా గాయపడ్డారు. అయితే, పేలుడు ఘటనలో గాయాల పాలై స్థానిక ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పరామర్శించారు. అనంతరం బాంబు పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ‍్లనుళ్లనున్నారు.
అంతకుముందు ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. సాయంత్రం 7గం. సమయంలో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఘటన జరిగింది. హుండాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలువురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పది నిమిషాల్లో అధికారులు ఘటనా స్థలిలోకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు
పేలుడుపై విచారణ జరుగుతోంది. ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ దర్యాప్తు చేస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే నేను ఘటనా స్థలానికి వెళ్తాను.. క్షతగాత్రులను పరామర్శిస్తాను’అని వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi: Blast near Red Fort Metro Station | Union Home Minister Amit Shah meets the people injured in the blast, at Lok Nayak Hospital. pic.twitter.com/IMPj2c77rv
— ANI (@ANI) November 10, 2025


