ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైన నేపథ్యంలో.. బీఎస్4 వాహనాలను నగరంలో ప్రవేశించకుండా నిషేధించారు. అయితే ఇప్పుడు ఆ ఆంక్షలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గాలి నాణ్యత మెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
డిసెంబర్ 13న, ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 స్థాయిని దాటిన తర్వాత.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ IV అమలులోకి వచ్చింది. ఈ సమయంలోనే రాజధానిలో కొన్ని నిర్దిష్ట వాహనాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఇప్పుడు గాని నాణ్యత మెరుగుపడటంతో.. ఈ నిషేధం తొలగించారు.
బీఎస్ 6 వాహనాలు మాత్రమే నగరంలోకి ప్రవేశించాలనే నియమం అమలు చేసిన సమయంలో.. సుమారు 1.2 మిలియన్ వాహనాలను నిషేధించారు. అయితే ఇప్పుడు ఆంక్షలు నిషేధించబడినప్పటికీ.. ఢిల్లీలో రిజిస్టర్ చేసుకున్న BS4 వాహనాన్ని కలిగి ఉంటే, మీ PUC చెల్లుబాటు అయితే, GRAP స్టేజ్ IV సమయంలో.. ఢిల్లీ NCRలో ఉపయోగించవచ్చు. ఢిల్లీలో రిజిస్టర్ కానీ బీఎస్3, బీఎస్4 వాహనాలు నగరంలో ప్రవేశించకూడదు. నియమాలను అతిక్రమించిన వాహనదారులు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


