breaking news
errakota
-
అందుకు ప్రతీకారంగానే ఎర్రకోట ఘటన!
ఢిల్లీ: ఎర్రకోట కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కశ్మీర్ మిలిటెంట్ గ్రూప్ నాయకుడు, హిజ్బుల్ ముజాహిదీన్‌లో కమాండర్‌గా ప్రసిద్ధి పొందిన బుర్హాన్ ముజాఫర్ వాని ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఢిల్లీ కారు పేలుడు జరిపినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. పేలుడు ఘటనలో డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ‘సూసైడ్ బాంబర్’గా మారి పదుల సంఖ్యలు ప్రాణాలు తీశాడు. అలా ప్రాణాలు తీసే ముందు తనలాగే వైట్ కాలర్ ఉగ్రవాదులగా మారిన ఇతరులకు తాను పాలకుడిని, నాయకుడిని అని, ఎమిర్(రాజుగా) అని పిలిపించుకునేవాడని తేలింది. బుర్హాన్ ముజాఫర్ వాని ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని గతంలో పలు మార్లు వారికి చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ కారు పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు హర్యానాలోని ఫరీదాబాద్‌లో అనుమానిత వైట్ కాలర్ ఉగ్రవాదుల్ని ప్రశ్నించినప్పుడు ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ ఉన్ నబీని ‘ఎమిర్’గా వర్ణించిన వ్యక్తి, అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో వైద్యుడిగా పనిచేసే ముజామిల్ షకీల్ అని అధికారులు నిర్ధారించారు. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రధాన వ్యక్తి మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ ద్వారా దేశంలోని పలువుర్ని వైట్ కాలర్ ఉగ్రవాదిగా మార్చేందుకు ప్రయత్నం చేశారు. అలా వైట్ కాలర్ ఉగ్రవాదిగా రిక్రూట్ చేసిన వ్యక్తి కూడా ఉమన్ ఉన్ నబీనేనని తేలింది. షాహీన్ సయీద్ కూడావిచారణలో అరెస్టయిన మరో అనుమానితుడు షాహీన్ సయీద్ కూడా దర్యాప్తుకు ఉపయోగపడే కీలక సమాచారాన్ని అందించినట్లు వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు అధికారుల ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన డాక్టర్ ముజామిల్ షకీల్ ఇటీవల ఎర్రకోట వద్ద కారు పేలుళ్ల కేసులో కీలక నిందితుడిగా అరెస్టయ్యాడు. ఆయన పేలుడు పదార్థాలు తయారు చేయడం, రసాయనాలను ప్రాసెస్ చేయడం, విపరీతమైన ఎక్స్‌ప్లోసివ్ మెటీరియల్ నిల్వ చేయడం వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు విచారణ సంస్థలు పేర్కొన్నాయి.ఆపరేషన్ ఎమిర్ ముజామిల్ షకీల్ తనను తాను కేవలం పని వాడిగా మాత్రమే భావించేవాడని, ఉమర్ ఉన్ నబీకి ఉన్న హోదా, అనుభవం, ప్రభావం తమ మాడ్యూల్లో అత్యంత ఉన్నత స్థాయిలో ఉండేదని తెలిపాడు. మాడ్యూల్ సభ్యులు తమ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ ఎమిర్’ అని పేరు పెట్టడం కూడా ఉమర్ ఉన్ నబీకి ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆత్మాహుతి బాంబర్‌గా వ్యవహరించిన ఉమర్ ఉన్ నబీ వైట్ కాలర్ ఉగ్రవాదులకు ఆదేశాలు, సూచనలు ఆధారంగానే మిగతా సభ్యులు పనిచేసినట్లు విచారణలో బయటపడింది.బుర్హాన్ ముజఫర్ వానిబుర్హాన్ ముజఫర్ వాని దక్షిణ కశ్మీర్ లోని సంపన్న కుటాంబానికి చెందిన ఓ యువకుడు. అయితే 2010లో తన సోదరుడిని ఆర్మీ బలగాలు చంపాయన్న కారణంగా 15 ఏళ్ల వయసులోనే ఉగ్రవాద గ్రూపులో చేరిపోయాడు. అప్పటి నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మిలిటెంట్ల ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, తన ప్రసంగాలతో యువకులను మిలిటెంట్లుగా మారేందుకు ఉత్తేజ పరిచేవాడు. అలా వందల సంఖ్యలో మిలిటెంట్లుగా మార్చడంలో బుర్హాన్ ముజఫర్ వాని కీలక పాత్ర పోషించాడు. 2016లో భారత భద్రతా బలగాలు అతడిని ఎన్కౌంటర్ చేశాయి. ఆ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా ఉమర్ ఉన్ నబీ ఢిల్లీ కారు పేలిన ఘటనలో సూసైడ్ బాంబార్గా మారి అమాయకుల్ని పొట్టనబెట్టుకున్నాడు. -
సంచలనం.. దేశ వ్యాప్తంగా 32 కార్లతో దాడులకు కుట్ర?
ఢిల్లీ: ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబర్ ఆరున ఢిల్లీలో వరుస బాంబుపేలుళ్లు జరపాలని వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తేలింది. ఆరు దశల్లో దాడులు జరిపేందుకు ఉగ్రవాదులు 32 కార్లను సిద్ధం చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులకు పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం రెడ్‌పోర్టు సమీపంలో హ్యుందయ్ ఐ20లో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన హ్యూందయ్ ఐ20తో పాటు మారుతి సూజికీ బ్రీజా, స్విఫ్ట్ డిజైర్,ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ వంటి కార్లు ఈ కుట్రలో భాగంగా ఉన్నట్లు తేలింది అందుకు ఎర్రకోట పేలుళ్లలో మరణించిన కారుతోపాటు పేలిపోయిన డాక్టర్ ఉమర్ నబీ కారు హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని మేవాట్‌కు చెందిన అల్–ఫలాహ్ యూనివర్సిటీలో లభ్యం కావడంతో ముష్కరుల ప్లాన్ బెడిసి కొట్టింది. ఎర్రకోట పేలుళ్లు, కారులో డాక్టర్ ఉమర్ నబీ డీఎన్ఏ లభ్యం కావడం, అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఉమర్ కారు ప్రత్యక్షమవ్వడంతో దర్యాప్తు సంస్థలు ఈ యూనివర్సిటీనే ఉగ్రవాదలు తమ కార్యకలాపాలకు అడ్డగా మార్చుకున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో జాతీయ భద్రతా సంస్థలు పేలుళ్ల కేసును ఆ కోణంలో దర్యాప్తు చేపట్టగా.. 32 కార్లతో దేశ వ్యాప్తంగా దాడులకు పాల్పడేందుకు కుట్ర జరిపిన ఆధారాలు సైతం వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుమానిత కార్లను గుర్తించేందుకు పోలీసులు,కేంద్ర భద్రతా బలగాలు సంస్థలు జల్లెడ పడుతున్నాయి. ఫరీదాబాద్‌లో అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయం సమీపంలోని తన అద్దె ఇంట్లో పేలుడుపదార్థాలను దాచిపెట్టేందుకు ఉగ్రవాదులకు సాయపడిన ఇస్లాం మతబోధకుడు, మౌల్వీ ఇష్తియాఖ్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మౌల్వీ తరచూ అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయంలో మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించేవాడు. అలా ఉమర్, ఘనీసహా పలువురు వైద్యులు, విద్యార్థుల మెదళ్లలోకి ఉగ్రభావజాలాన్ని నింపినట్లు తేలింది.ఐఈడీల తయారీ! మౌల్వీ సాయంతో ఉగ్రమూకలు 200 ఐఈడీల తయారీలో ఉగ్రమాడ్యూల్ సభ్యులు గతంలోనే మునిగిపోయారని దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియాగేట్, కాన్సిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం, గురుగ్రామ్, ఫరీదాబాద్‌సహా దేశంలోని కీలక ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వేస్టేషన్లు, మాల్స్ వద్ద పేలుళ్లు జరపాలని భారీ ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో అమ్మోనియం నైట్రేట్‌తోపాటు ఒక కొత్తతరహా రసాయనం అశేషాలను పోలీసులు గుర్తించడంతో దేశ వ్యాప్తంగా ఉగ్రకుట్రను భగ్నం చేశారు. -
ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యే: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యేనని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ ఖండించింది. రెండు నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్.. మృతులకు సంతాపం తెలిపింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఉగ్రవాదాన్నిపై జీరో టోలరెన్స్ విధానంతో అణిచివేస్తామని కేబినెట్ వెల్లడించింది. ఘటనకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి.. శిక్షిస్తామని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేబినెట్ సమావేశంతో పాటు కేంద్ర భద్రతా మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో ఎర్రకోట పేలుళ్లు,ఉగ్రవాద నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కారు పేలుడు ఘటనలో తదుపరి కార్యచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు, అంతర్గత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు, కేంద్ర మంత్రివర్గంలో చర్చి జరిగినట్లు తెలుస్తోంది.పలు కీలక నిర్ణయాలు..కాగా, ఎగుమతుల ప్రమోషన్ మిషన్ బలోపేతానికి 25,060 కోట్ల రూపాయల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులకు ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ మిషన్ కింద రెండు పథకాలను కేంద్రం నిర్వహించనుంది. నిర్యాత్ ప్రోత్సాహన్, నిర్యాత్ దిశ కొత్త పథకాలను కేంద్రం అమలు చేయనుంది. ఎగుమతి దారులకు 100 శాతం క్రెడిట్ గ్యారెంటీ స్కీం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 20,000 కోట్ల రూపాయల వరకు ఎలాంటి హామీ లేకుండా ఎగుమతి దారులకు ప్రభుత్వం.. క్రెడిట్ సపోర్ట్ ఇవ్వనుంది.ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. లాల్ ఖిలా మెట్రోస్టేషన్ ఒకటో నంబర్ గేటు సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆగిన హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన భారీ పేలుడు ధాటికి కారులోని ముగ్గురు సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పక్కన ఉన్న ఆరు కార్లు, రెండు ఇ–రిక్షాలు, ఆటోలు సైతం తీవ్రస్థాయిలో ధ్వంసమయ్యాయి. దీంతో మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన సమీపంలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. పేలుడు ధాటికి సమీప మార్కెట్లోని ప్రజలు, రోడ్లమీద ఉన్న వ్యక్తులు ప్రాణభయంతో పరుగులుతీశారు. తీవ్రస్థాయి పేలుడు కారణంగా మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అక్కడ భీతావహవాతావరణం నెలకొంది. మంటలు, హాహాకారా లు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీ సమీప ఫరీదాబాద్‌లో 2,900 కేజీల పేలుడు పదార్థాలను జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ పోలీసుల బృందం స్వాదీనంచేసుకున్న కొన్ని గంటలకే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం యాధృచ్ఛికం కాదని దర్యాప్తు వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సరిగ్గా సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు లాల్‌ఖిలా మెట్రోస్టేషన్ ఎదురుగా ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎర్రలైట్ పడటంతో కొన్ని వాహనాలు ఆగాయి. అదే సమయంలో ఐ20 మోడల్ కారు వెనుకభాగం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఛాందిని చౌక్ మార్కెట్లోని జనం భయంతో పరుగులు తీశారు. పేలుడు ధాటికి సమీప వాహనాలు సైతం మంటల్లో కాలిపోయాయని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా మీడియాతో చెప్పారు. ఘటనపై మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. ఘటన వివరాలను ప్రధాని మోదీ అమిత్‌షాను అడిగి తెల్సుకున్నారు. -
ఢిల్లీ పేలుడు.. ఘటనా స్థలానికి అమిత్‌షా
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో 10మంది మృతి చెందారు. 20మందికి పైగా గాయపడ్డారు. అయితే, పేలుడు ఘటనలో గాయాల పాలై స్థానిక ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పరామర్శించారు. అనంతరం బాంబు పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లనుళ్లనున్నారు.అంతకుముందు ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. సాయంత్రం 7గం. సమయంలో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఘటన జరిగింది. హుండాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలువురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.. పలు వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పది నిమిషాల్లో అధికారులు ఘటనా స్థలిలోకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారుపేలుడుపై విచారణ జరుగుతోంది. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ దర్యాప్తు చేస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే నేను ఘటనా స్థలానికి వెళ్తాను.. క్షతగాత్రులను పరామర్శిస్తాను’అని వ్యాఖ్యానించారు. #WATCH | Delhi: Blast near Red Fort Metro Station | Union Home Minister Amit Shah meets the people injured in the blast, at Lok Nayak Hospital. pic.twitter.com/IMPj2c77rv— ANI (@ANI) November 10, 2025 -
Independence Day 2024: ఐదో వరుసలో రాహుల్
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రతిపక్ష నేత పాల్గొనడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అయితే ఆయనకు ఐదో వరుసలో సీటు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. రాహుల్ ముందు వరుసలో పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత హాకీ క్రీడాకారులు కూర్చున్నారు. ఈ ఉదంతం ప్రధాని నరేంద్ర మోదీ అల్పబుద్ధికి నిదర్శనమంటూ కాంగ్రెస్ మండిపడింది. ‘‘లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలైన రాహుల్, మల్లికార్జున ఖర్గేలకు ప్రొటోకాల్ ప్రకారం తొలి వరుసలో సీటు కేటాయించాలి. కానీ వారిని ఐదో వరుసలో కూర్చోబెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మోదీలో అహంకారం తగ్గలేదు’’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ దుయ్యబట్టారు. ముందు వరుసలను ఒలింపిక్ విజేతలకు కేటాయించినందున రాహుల్‌ను వెనక వరుసకు మార్చామన్న రక్షణ శాఖ వివరణపై ఆయన తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘క్రీడాకారులకు గౌరవమివ్వాల్సిందే. కానీ అందుకోసం కొందరినే వెనక్కు జరిపారెందుకు? అమిత్ షా, జేపీ నడ్డా, ఎస్.జైశంకర్, నిర్మలా సీతారామన్ తదితర కేంద్ర మంత్రులను మొదటి వరుసలోనే ఎలా కూర్చోబెట్టారు?’’ అని ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియాలోనూ బాగా చర్చ జరిగింది. లోక్‌సభలో విపక్ష నేతకు కేబినెట్ హోదా ఉంటుంది. కేంద్ర మంత్రులతో పాటు ఆయనకు కూడా ముందు వరుసలో సీటు కేటాయిస్తారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో విపక్ష నేత పదవి పదేళ్లు ఖాళీగా ఉంది. -
పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ లుక్ వేరేలెవెల్!
ఈ రోజు దేశం నలుమూలల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటేల సంబరాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించడం విశేషం. ఈ నేపథ్యంలో మోదీ లుక్ సరికొత్త స్టైల్‌కి నిర్వచనంలో డిఫెరెంట్‌గా దర్శనమిచ్చారు. మన జాతీయత రంగుల మేళవింపుతో డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. అందరూ మన జాతీయ జెండా రంగుల కలియిక డ్రెస్‌లతో దర్శనమిస్తే ఆయన ఆ రంగుల మేళవింపుతోనే స్టైలిష్ లుక్‌లో కనిపించారు. మన జాతీయతకు చిహ్నంగా ఉండే రంగులతో ఫ్యాషన్‌గా ఉండొచ్చు అనేలా తలపాగ, కుర్తా-పైజామా ధరించారు. వాటి రంగులు కూడా మన దేశ జెండాని తలపించేలా ఫ్యాషన్‌కి నిర్వచనం ఇచ్చారు. ఇక్కడ మోదీ రాజస్థానీ లెహరియా తలపాగాను ధరించారు. ఇది ఆకుపచ్చ, నారింజ రంగు మేళవింపుతో దేశ జెండాను గుర్తు తెచ్చేలా హైలెట్‌గా కనిపించింది. అలాగే తెల్లటి కుర్తా, పైజామా, నీలిరంగు జాకెట్ జెండాలోని తెల్లటి రంగు, నీలం రంగులో ఉండే ఆశోక చక్ర రంగుని గుర్తు చేశాయి. మన దేశం ముక్కోణపు రంగుల మేళవింపుతో కూడిన వేషధారణతో స్టైలిష్‌గా కనిపించడం విశేషం. మన దేశ ప్రధాని ధరించిన శక్తిమంతమై రంగుల కలియిక ఎందరో త్యాగధనుల ఫలితమైన స్వాతత్య్ర వేడకకు అర్థం చెప్పేలా ఉంది. ఇక్కడ ఆయన ధరించి ఐస్ బ్లూ జాకెట్ 200 సంవత్సరాల వలస పాలన తర్వాత మనకు లభించిన స్వాతంత్య్రాన్ని తెలియజేస్తుంది. ఇక ఆయన ధరించిన తలపాగలోని ఆగుపచ్చ అభివృద్ధి, శ్రేయస్సుని తెలియజేయగా, నారింజ రంగు అమరవీరుల త్యాగాన్ని సూచిస్తోంది. ఇక తెలుపు రంగు కుర్తా పైజామా శాంతి, స్వచ్ఛతను తెలుపుతోంది. వాటన్నింటి తన వేషధారణతో తెలయజేయడం విశేషం. ఇంతవరకు అందరూ త్రివర్ణ పతాక షేడ్స్‌లో దుస్తులు ధరిస్తే ఆయన ట్రైండ్కి తగ్గట్టు సరికొత్త లుక్‌లో కనిపించడం విశేషం. కాగా, గత దశాబ్దం నుంచి మోదీ సాంప్రదాయ రాజస్థానీకి చెందిన బంధేజ్, బంధాని ప్రింట్ టర్బన్లు, మల్టీకలర్ టర్బన్లు వంటి తలపాగలెన్నో ధరించారు. #IndependenceDay2024 | PM Modi to address the nation from the ramparts of Red Fort, shortly (Photo source: PM Modi/YouTube) pic.twitter.com/KggCaY2VRI— ANI (@ANI) August 15, 2024 (చదవండి: అదో గిగా బర్గర్... ప్రపంచ రికార్డు కొట్టేసింది!) -
మువ్వన్నెల స్ఫూర్తిని క్షేత్రస్థాయికి చేర్చండి: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమం సందర్భంగా సమాజంలోని దురాచారాలను తరిమి వేయడంపై యువత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మహిళలకు సరైన గౌరవం కల్పించడంతోపాటు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు చేయూతనందించినపుడే అందరినీ సమాజాభివృద్ధిలో భాగస్వాములుగా చేయగలమని ఉపరాష్ట్రపతి సూచించారు.బుధవారం ఢిల్లీలో ఎర్రకోట ప్రాంగణం నుంచి తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి అంతకుముందు బైక్ ర్యాలీకి వచ్చిన ఎంపీలు, కేంద్రమంత్రులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. -
16 కవాతు బృందాలు, 25 శకటాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 16 కవాతు బృందాలు, 17 మిలటరీ బాండ్లు, వివిధ రాష్ట్రాలు–కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 25 శకటాలు రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొంటాయని ఇండియన్ ఆర్మీ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. రిపబ్లిక్ డే పెరేడ్లో సైనిక విన్యాసాలు, తేలికపాటి హెలికాఫ్టర్ల విన్యాసాలు కూడా ఉంటాయని తెలిపింది. మన దేశ సైనిక సత్తాని చాటి చెప్పేలా పిటి–76 ట్యాంకు, ఒక సెంచురీయన్ ట్యాంకు, రెండు ఎంబిటి అర్జున్ ఎంకే–1 ట్యాంకులు, ఒక ఓటీæ–62తో పస్ ఆర్మర్డ్ పర్సనల్ కేరియల్, ఒక బీఎంపీ–1 ఇన్ఫాంటరీ ఫైటింగ్ వెహికల్‌ను ప్రదర్శించనున్నారు. ఇవే కాకుండా క్షిపణి వ్యవస్థల్ని కూడా ప్రదర్శిస్తారు. సరిహద్దు భద్రతా సిబ్బంది మహిళా బృందం చేసే బైక్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతీ ఏడాది సంప్రదాయంగా నిర్వహించినట్టే విజయ్‌చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. -
కాకి చనిపోయింది.. కోట మూసేశారు
సాక్షి, న్యూఢిల్లీ: ఎర్రకోట మీద ఓ కాకి చనిపోయింది... పరీక్షలు నిర్వహిస్తే కాకికి బర్డ్‌ఫ్లూ సోకిందని తేలింది. దీంతో ఈ నెల 26 వరకు ఎర్రకోట మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ప్రకటన చేశారు. ఈ నెల 10న సుమారు 15 కాకులు ఎర్రకోట ప్రాంగణంలో మృతిచెందడాన్ని అధికారులు గుర్తించారు. జలంధర్‌లోని లేబరేటరీకి పరీక్షల నిమిత్తం వాటిని పంపించగా ఒక కాకికి బర్డ్‌ఫ్లూ సోకిందని తేలిందని ఢిల్లీ ప్రభుత్వ పశు సంరక్షణ విభాగం డైరెక్టర్ రాకేష్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే రోజైన ఈ నెల 26 వరకు సందర్శకులను ఎర్రకోట లోపలికి అనుమతించడం లేదని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఒక గూడ్లగూబ మృతదేహం పరీక్షించగా దానికి బర్డ్‌ఫ్లూ సోకినట్లు నిర్థారణ అయిందని అధికారులు తెలిపారు. -
బలమైన భారత్ కోసం...
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 122వ జయంతి సందర్భంగా కేంద్రం ఆయనకు అరుదైన గౌరవం కల్పించింది. ఢిల్లీలోని ఎర్రకోటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో ఓ మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించారు. అలాగే జలియన్ వాలాబాగ్ ఊచకోత, మొదటి ప్రపంచయుద్ధంలో భారత సైనికుల స్మృత్యర్థం ‘యాదే జలియన్ మ్యూజియం’, భారత కళలకు సంబంధించి ‘దృశ్యకళ’ మ్యూజియం, 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలను గుర్తుకుతెచ్చేలా మరో మ్యూజియాన్ని ప్రధాని ఎర్రకోటలో ప్రారంభించారు. ఈ నాలుగు మ్యూజియాలను కలిపి ‘క్రాంతి మందిర్’గా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ..‘ఘనమైన భారత చరిత్ర, సంస్కృతికి సంబంధించి నాలుగు మ్యూజియాలను ఆవిష్కరించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. శక్తిమంతమైన భారత్‌ను నిర్మించాలన్న బోస్ సంకల్పాన్ని నెరవేర్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ మ్యూజియాన్ని సందర్శించే యువత నేతాజీ జీవితం నుంచి మరింతగా స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నా. ఎర్రకోటలోని ఈ గోడల్లో చరిత్ర ప్రతిధ్వనిస్తోంది. వలసపాలకులు ఇక్కడే కల్నల్ ప్రేమ్ సెహగల్, కల్నల్ గుర్బ„Š సింగ్ ధిల్లాన్, మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్‌లను విచారించారు’ అని ట్విట్టర్లో తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా సుభాష్ చంద్రబోస్ వాడిన టోపీని ఆయన కుటుంబ సభ్యులు మోదీకి బహూకరించగా, ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆ టోపీని మ్యూజియంకు ఇచ్చేశారు. స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా బోస్‌వాడిన కుర్చీ, యూనిఫాం, మెడల్స్‌తో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్‌కు సంబంధించిన పలు వస్తువులను బోస్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అలాగే సుభాష్ చంద్రబోస్ జీవితంపై తీసిన డాక్యుమెంటరీని ఇక్కడ ప్రదర్శిస్తారు. ఇక మొదటి ప్రపంచయుద్ధంలో అమరులైన 15 లక్షలమంది భారతీయ జవాన్ల వీరోచిత పోరాటం, త్యాగాన్ని యాదే జలియన్ మ్యూజియంలో ఫొటోల రూపంలో తీర్చిదిద్దారు. భారత సైని కుల త్యాగాన్ని ప్రశంసిస్తూ సరోజినీ నాయుడు రాసిన ‘గిఫ్ట్’ పద్యాన్నీ ప్రదర్శనకు ఉంచారు. -
స్వేచ్ఛా వాయువులకు 69 ఏళ్లు
ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి విశాఖ సాగరతీరం వేదిక తెలంగాణలో గోల్కొండ కోటపై జాతీయ జెండా రెపరెపలు రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి వేర్వేరుగా వేడుకలు సాక్షి, స్కూల్ ఎడిషన్: ‘నీ ధర్మం.. నీ సంఘం.. నీ దేశం.. నువు మరవొద్దు.. జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవొద్దు..’ అన్నాడో సినీ కవి. భరతమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించడానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్రుణప్రాయంగా అర్పించారు. వారందరినీ సదా స్మరించుకుంటూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. నేడు భారత 69వ స్వాతంత్య్ర దినోత్సవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా జరిగాయి. ఏపీలో విశాఖపట్నంలోని సాగరతీరం ఈసారి వేదిక కాగా, తెలంగాణలో గతేడాది మాదిరిగానే గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. విప్లవ వీరులను స్మరించుకుందాం.. ‘విప్లవం నా జన్మ హక్కు’ అంటూ తెల్లదొరల పాలిట సింహస్వప్నంగా మారి తిరుగుబాటు చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, స్వతంత్ర భారతావని కోసం ఉరికొయ్యను ముద్దాడి వీరమరణం పొందిన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి, తన రచనలతో విప్లవ జ్యోతి రగిలించిన గురజాడ అప్పారావు, టంగుటూరి వీరేశలింగం పంతులు, బ్రిటిష్ వారిని హడలెత్తించిన కడప కోటిరెడ్డి, తేనేటి విశ్వనాథం, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య, గౌతు లచ్చన్న, కొమురం భీమ్, సరోజినీ నాయు డు, ఎన్జీ రంగా, సురవరం ప్రతాపరెడ్డి... ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర పుటల్లో వందలాది మంది తెలుగు వీరులున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాట్లు.. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి కర్నూలు జిల్లాలో గతేడాది జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. అయితే ఈ సారి విశాఖ సాగరతీరంలోని బీచ్‌రోడ్డు, విశ్వప్రియ ఫంక్షన్ హాలు పక్కన ఈ వేడుకలు జరిపారు. తెలంగాణలో.. గతేడాది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో స్వాతంత్య్ర వేడుకలు చారిత్రక కట్టడం గోల్కొండ కోటపై నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గోల్కొండ కోటపైనే త్రివర్ణపతాకం ఆవిష్కరించారు. -
ఎర్రకోటకు పోటెత్తిన యువతరం
ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న విద్యార్థులు న్యూఢిల్లీ: నగరంలోని విశ్వవిద్యాలయాల విద్యార్థిలోకం శుక్రవారం ఎర్రకోటకు తరలింది. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వినేందుకు తామంతా ఎర్రకోటకు వచ్చినట్లు ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ, ఐపీ యూనివర్సిటీ విద్యార్థులు తెలిపారు. మువ్వన్నెల జెండాను ప్రధాని ఎగురవేస్తున్న సందర్భంలో విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. తమ కరతాళ ధ్వనులతో స్వాతంత్య్రోత్సవ సంబరాలను మార్మోగించారు. జై జవాన్, జైకిసాన్ అంటూ దేశానికి వెన్నెముక అయిన రైతును, కంటికి రెప్పలా కాపాడుతున్న జవానును స్మరించుకున్నారు. పతావిష్కరణ తర్వాత మోడీ ప్రసంగాన్ని ఆసాంత ఆసక్తిగా విన్నారు. ప్రసంగంలో మోడీ చమక్కులకు అనుగుణంగా విద్యార్థుల నుంచి స్పందన కనిపించింది. దేశభక్తి ఉప్పొంగేలా మోడీ ప్రసంగించారంటూ కొనియాడారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల జాకీర్ హుసేన్ కాలేజీలో రాజనీతి శాస్త్రాన్ని అభ్యసిస్తున్న కృష్ణన్ ప్రతాప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘నా స్నేహితులు పదిమందితో కలిసి ఇక్కడికి వచ్చాను. మోడీ ప్రసంగం అద్భుతంగా అనిపించింది. సాధారణ జనాన్ని కూడా అనుమతిస్తున్నారని తెలియగానే మోడీ ప్రసంగం వినాలని నిర్ణయించుకున్నాం. మేము మాత్రమే కాకుండా మా కాలేజీకి చెందిన వందల మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర సంబరాలను చూస్తుంటే గర్వంగా అనిపించింది. పతాకావిష్కరణ కోసం ప్రధాని వస్తున్నప్పుడు వేలాది మంది నిల్చోవడం దేశ ప్రజలు మోడీకి ఇచ్చే గౌరవానికి నిదర్శనంగా అనిపించింద’న్నాడు. అదే కళాశాలకు చెందిన జర్నలిజం విద్యార్థి రుక్సానా మాట్లాడుతూ... ‘గతంలో స్వాతంత్య్రోత్సవాలను తిలకించేందుకు ఎర్రకోట వద్దకు ఎప్పుడూ రాలేదు. యువతకు ఆరాధ్యుడైన మోడీ ఇక్కడ జాతినుద్దేశించి చేసే ప్రసంగాన్ని వినేందుకే ఈసారి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను. ఆయనతో మాట్లాడాలని, చూడాలని భావించాను. అయితే మాట్లాడలేకపోయినా ఎర్రతివాచీపై మోడీ నడుచుకుంటూ వస్తుండడం చూశాను. ఆయన ప్రసంగం మొత్తం విన్నాను. అద్భుతంగా అనిపించింద’ని సంబరపడింది. ఇలా వేలాదిమంది విద్యార్థులు మోడీ ప్రసంగం పూర్తయ్యేవరకు ఎర్రకోట వద్దే గడిపారు. ఆ తర్వాత కూడా వారంతా మోడీ గురించి మాట్లాడుకోవడమే కనిపించింది.


