సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతిని పురస్కరించు కుని, ఢిల్లీ ప్రభుత్వం 'అటల్ క్యాంటీన్' పథకాన్ని ప్రారంభించింది. పేదలు, కార్మికులు, తక్కువ ఆదాయ వర్గాల ఆహారం అందించే లక్ష్యంతో 100 అటల్ క్యాంటీన్‌లను ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రారంభించారు. ఈ క్యాంటిన్‌లలో కేవలం రూ. 5కే పోషకమైన భోజనం అందిస్తారు.
అటల్ క్యాంటీన్లు
ఢిల్లీలో ఆర్‌కె పురం, జంగ్‌పురా, షాలిమార్ బాగ్, గ్రేటర్ కైలాష్, రాజౌరి గార్డెన్, నరేలా, బవానా, ఇతర ప్రదేశాలలో విస్తరించి ఉన్న 45 అటల్ క్యాంటీన్లు అందుబాటులో వచ్చాయి. మిగిలిన 55 క్యాంటీన్లను రాబోయే రోజుల్లో ప్రారంభించనున్నారు. ఈ క్యాంటీన్లు రోజుకు రెండు పూటలా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య భోజనం మరియు సాయంత్రం 6:30 నుండి రాత్రి 9:30 గంటల మధ్య రాత్రి భోజనం దాదాపు 500 మందికి అందిస్తాయి. ఈ థాలి (ప్లేట్)లో పప్పు (చిక్కుళ్ళు), బియ్యం, చపాతీ, సీజనల్ కూరగాయలు , ఒక చట్నీ ఉంటాయి.
VIDEO | Delhi: On the birth anniversary of former Prime Minister and Bharat Ratna Atal Bihari Vajpayee, Atal Canteens were inaugurated across several parts of the capital, including Nehru Nagar, in the presence of Union Minister Manohar Lal Khattar. In the first phase, 45 Atal… pic.twitter.com/DKJs72OygB
— Press Trust of India (@PTI_News) December 25, 2025
భోజన పంపిణీ కోసం డిజిటల్ టోకెన్ వ్యవస్థ
ఢిల్లీ ప్రభుత్వం భోజనం పంపిణీ చేయడానికి మాన్యువల్ కూపన్ల స్థానంలో డిజిటల్ టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. సీసీటీవీ కెమెరాలు ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు (DUSIB) డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అన్ని కేంద్రాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తాయి. పప్పు (చిక్కుళ్ళు), బియ్యం, చపాతీ, కర్రీ, చట్నీతో కూడిన రుచికరమైన భోజనం రెస్టారెంట్ రకం, ప్రాంతాన్ని బట్టి ఢిల్లీలో ఒక్కోథాలీ ధర రూ. 500 నుండి రూ. 2,000 వరకు ఉంటుంది. దీని ప్రకారం ఒక్క పూటైనా నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లలేని పేదలకు కేవలం పదో వంతు ధరకే సంతృప్తికరమైన భోజనం లభించనుంది.


