క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: క్రీస్తు బోధనలతో సమాజంలో సామరస్య స్ఫూర్తి నెలకొంటోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పవిత్ర క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఉదయాన్నే ‘మార్నింగ్‌మాస్’లో భాగంగా ఢిల్లీలోని ప్రముఖ ‘క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్’కు వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు.
‘‘ఢిల్లీలోని ప్రఖ్యాత క్యాథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడమ్షన్‌కు ఉదయాన్నే వెళ్లా. ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నా. అక్కడి సేవా తత్పరత కాలాతీత ప్రేమ, శాంతి, దయాగుణాలకు ప్రతిబింబంగా నిలిచింది. క్రిస్మస్ పండుగస్ఫూర్తి సమాజంలో శాంతి, సామరస్యాలకు స్ఫూర్తినిస్తుంది. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ నా క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. శాంతి, నమ్మకం, జాలితో నిండిన సంతోషదాయక క్రిస్మస్‌ను అందరూ జరుపుకోవాలి. ఏసు క్రీస్తు అద్భుత బోధనలు సమాజంలో సామరస్యాన్ని మరింత పటిష్టవంతం చేయాలని మనసారా ప్రారి్థస్తున్నా’’అని మోదీ అన్నారు. ఉదయం చర్చికి విచ్చేసిన సందర్భంగా ముందు వరస సీట్లో కూర్చుని క్రైస్తవులతో పాటు ప్రత్యేక గీతాలను మోదీ ఆలపించారు. చర్చిలో ఢిల్లీ బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ పాల్ స్వరూప్ చేసిన బోధనలను మోదీ ఆసక్తిగా విన్నారు.


