సేమ్‌ టు సేమ్‌.. లవ్‌లో పడ్డారు కదూ! | Netizens Comments on Umar Riaz and Parineeti Chopra Wear Same White T Shirt | Sakshi
Sakshi News home page

Umar Riaz - Parineeti Chopra: హీరోయిన్‌తో ప్రేమలో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌?

Apr 16 2022 6:26 PM | Updated on Apr 16 2022 7:07 PM

Netizens Comments on Umar Riaz and Parineeti Chopra Wear Same White T Shirt - Sakshi

తాజాగా హిందీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఉమర్‌ రియాజ్‌, హీరోయిన్‌ పరిణీతి చోప్రా లవ్‌లో పడ్డారంటూ నెట్టింట కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇద్దరూ ఒకే టీషర్ట్స్‌ వేసుకున్నారని, ఇది ప్రేమలో ఉన్నామని అంగీకరించడమే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు...

తాను పట్టుకున్న మంచానికి మూడే కాళ్లన్నట్టుగా ఉంది సోషల్‌ మీడియాలో కొందరి పరిస్థితి. ఎవరైనా ఇద్దరూ ఇంచుమించు ఒకేలా ఉన్న డ్రెస్‌ వేసుకుంటే వారి మధ్యలేదో ఉందంటూ లేనిపోనివి సృష్టించేస్తున్నారు. ప్రేమపక్షులు అంటూ ముద్రవేస్తున్నారు. తాజాగా హిందీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఉమర్‌ రియాజ్‌, హీరోయిన్‌ పరిణీతి చోప్రా లవ్‌లో పడ్డారంటూ నెట్టింట కొందరు పోస్టులు చేస్తున్నారు.

ఇద్దరూ ఒకే టీషర్ట్స్‌ వేసుకున్నారని, ఇది ప్రేమలో ఉన్నామని అంగీకరించడమే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అవునవును, ఇద్దరి టీషర్ట్స్‌ ఒకేలా ఉన్నాయి. ఇద్దరి మధ్య ఏదో ఉదంటూ మరికొందరు దానికి వంత పాడుతున్నారు. ఉమర్‌ ఫ్యాన్స్‌ ఓ అడుగు ముందుకు వేసి ఇద్దరి ఫొటోలను ఎడిటింగ్‌ చేసి మరీ పోస్ట్‌ చేస్తుండటం గమనార్హం. అయితే ఇదంతా కేవలం ఫన్‌ కోసం చేశారని తెలుస్తోంది. కాగా గతంలో ఉమర్‌ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రష్మీ దేశాయ్‌తో లవ్‌లో ఉన్నాడంటూ రూమర్లు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే!

చదవండి: ప్రియురాలితో యాంకర్‌ వివాహం, నెట్టింట ఫొటోలు వైరల్‌

 ట్విటర్‌ అకౌంట్‌ పేరు మార్చిన చిరంజీవి.. రామ్‌చరణ్‌ స్పెషల్‌ వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement