సోషల్ మీడియా ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీనిలో మునిగిపోతున్నారు. పిల్లల్లో అయితే సామాజిక మాధ్యమాల ఎఫెక్ట్ మరింత అధికంగా ఉంటుంది. అయితే మద్రాస్ హైకోర్టు పిల్లల్లో సోషల్ మీడియా వాడకంపై కీలక సూచన చేసింది. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు వాటిని వాడకుండా నియంత్రించాలని సూచించింది.
పిల్లల్లో ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. మానసికంగా, శారీరకంగా ఎదగాల్సిన వయస్సులో గంటల గంటలు ఫోన్‌లకు అతుక్కపోయి వాటిలోనే గడపడంతో ఆందోళన, డిఫ్రెషన్, ఒత్తిడి తదితర సమస్యలు చిన్న వయసులోనే వెలుగు చూస్తున్నాయి. వారి తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు ఫోన్‌లకు దూరం చేద్దామని ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు తెలిపింది.
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలకు అనుమతించకుండా చట్టం రూపొందించాలని కోర్టు పేర్కొంది. ఆస్ట్రేలియాలో ఈ మధ్య ఇటువంటి చట్టం రూపొందించారని భారత్‌లో సైతం ఈ విషయం ఆలోచించాలని తెలిపింది. తద్వారా హానికరమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను పిల్లలు చూడకుండా నియంత్రిచవచ్చని పేర్కొంది.
అదేవిధంగా అటువంటి కఠిన చట్టాలు రూపొందించే వరకూ పిల్లలు ఇంటర్నెట్‌ను సురక్షితంగా వాడేలా రాష్ట్ర ప్రభుత్వం, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా ఓ కార్యాచరణ సిద్ధం చేయాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.


