Bihar Polling: బిహార్‌లో రికార్డు పోలింగ్‌ | Bihar Assembly Elections 2025 Phase 2 Polling Live Updates, Voting Percentage, Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

Bihar Elections Polling Live: బిహార్‌లో రికార్డు పోలింగ్‌

Nov 11 2025 6:38 AM | Updated on Nov 11 2025 7:59 PM

Bihar Elections 2025 Phase 2 LIVE Updates

పాట్నా: బిహార్‌లో మలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్‌ సాయంత్రం ఐదుగంటల వరకు జరగ్గా.. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బిహార్‌లో రికార్డ్‌ స్థాయిలో పోలింగ్‌ జరిగింది. 

సాయంత్రం 6 గంటలకు 68.55 శాతం పోలింగ్ నమోదైంది. కస్బా అసెంబ్లీలో అత్యధికంగా 80.89 శాతం పోలింగ్ నమోదు కాగా.. నవాడా అసెంబ్లీలో అత్యల్పంగా 54.83 శాతంతో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతానికి ఓటింగ్‌ శాతం ఇలా ఉన్నా.. ఎన్నికల సంఘం ఓటింగ్‌ శాతం ఎంత నమోదైందనే దానిపై అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.  

కాగా, ఇవాళ జరిగిన రెండో విడుత ఎన్నికల్లో 1302మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. మొదటి విడుతలో 66.46శాతం ఓటింగ్‌ నమోదుదైంది. రెండు దశల్లో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌  నవంబర్‌ 14న జరగనుంది. అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. .(Bihar Assembly Elections Phase 2 Polling Updates)

 బిహార్‌లో అత్యధిక శాతం నమోదైన ప్రాంతాలివే

  • పశ్చిమ చంపారన్ లో 69.02 శాతం 
  • తూర్పు చంపారన్‌లో 69.31 శాతం 
  • షియోహర్‌లో67.31 శాతం 
  • సీతామర్హిలో 65.29 శాతం 
  • మధుబనిలో 61.79 శాతం 
  • సుపాల్‌లో 70.69 శాతం 
  • అరారియాలో 67.79 శాతం 
  • కిషన్ గంజ్‌లో 76.26 శాతం 
  • పుర్నియాలో 73.79 శాతం 
  • కతిహార్‌లో 75.23 శాతం 
  • భాగల్ పూర్‌లో 66.03 శాతం 
  • బంకాలో 68.91 శాతం 
  • కైమూర్ (భాబువా)లో 67.22 శాతం 
  • రోహ్తాస్‌లో 60.69 శాతం 
  • అర్వాల్‌లో 63.06 శాతం 
  • జెహానాబాద్‌లో 64.36 శాతం 
  • ఔరంగాబాద్‌లో 64.48 శాతం 
  • గయలో 67.50 శాతం 
  • నవాడాలో 57.11 శాతం 
  • జమూయిలో 67.81 శాతం

67.14 శాతం పోలింగ్ నమోదు

  • సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ నమోదు...
  • బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక  పోలింగ్‌గా రికార్డు
  • బిహార్‌లోముస్లిం మెజారిటీ కిషన్ గంజ్ లో అత్యధికంగా 76.26 శాతం పోలింగ్
  • నవాడాలో అత్యల్పంగా 53.17 శాతం పోలింగ్ 
  • నవాడాలోని మిషన్ స్కూల్ బూత్ నంబర్ 351లో 105 ఏళ్ల వృద్ధురాలు అమలా ఖాతూన్ ఓటు వేశారు. ఎన్నికల సిబ్బంది ఆమెకు గులాబీతో స్వాగతం పలికారు.

ఇరు వర్గాల మధ్య ఘర్షణ
జమూయిలో ఎన్నికల సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు, ఇటుకలు, రాళ్లు విసిరారు. జమూయి అసెంబ్లీ నియోజకవర్గంలోని జుండన్ గ్రామంలో పోలింగ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య వివాదం ఘర్షణ మరియు రాళ్లు రువ్వడానికి దారితీసింది. పోలింగ్ పార్టీ అధికారి పోలింగ్ స్టేషన్ల నంబర్ 381 మరియు 382 వద్ద డబ్బులు తీసుకున్నారని, ఆ తర్వాత గ్రామస్తులు అతన్ని బందీగా ఉంచడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. 

దీనిపై అవతలి వర్గానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి ఘర్షణ మొదలైంది. రాళ్లు రువ్వడంలో విశాల్ కుమార్ అనే యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటనలో పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఒక సంఘం ఇంట్లోకి ప్రవేశించి దోచుకున్నారని మహిళలు ఆరోపించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఎస్డీవో సౌరభ్ కుమార్, ఎస్డీపీవో సతీష్ సుమన్, ఖైరా పోలీస్ స్టేషన్ ఇన్చార్జి, బీడీవో తదితరులు బృందంతో కలిసి శిబిరాలు నిర్వహిస్తున్నారు.
 

వృద్ధ ఓటర్ల ఉత్సాహం

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశలో, వృద్ధ ఓటర్ల ఉత్సాహంతో ప్రజాస్వామ్య వేడుకలు మరింత ప్రత్యేకంగా మారాయి. 111 ఏళ్ల నషిమా ఖాతున్ సుపాల్ జిల్లాలోని ఛత్తపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మాధోపూర్ పంచాయతీలోని పోలింగ్ బూత్ నంబర్ 274కు వీల్ చైర్ పై చేరుకున్నారు. 

అదే సమయంలో రోహ్తాస్ జిల్లా కర్గహార్ అసెంబ్లీ నియోజకవర్గం బసుంధర గ్రామానికి చెందిన రామ్ చెలా యాదవ్ (95) ఓటు హక్కు వినియోగించుకున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనడం ప్రతి పౌరుడి కర్తవ్యం అనే సందేశాన్ని వారిద్దరూ తమ ఉత్సాహంతో అందించారు.

 

అర్వాల్ లో ప్రిసైడింగ్ అధికారి కన్నుమూత
ప్రిసైడింగ్ అధికారి అరవింద్ కుమార్ అర్వాల్‌లో ఓటింగ్ సమయంలో గుండెపోటుతో మృతి

బెట్టియా: డబ్బులు పంపిణీ చేసిన ఇద్దరు ఆర్జేడీ మద్దతుదారుల అరెస్ట్‌
షియోహర్:   పోలింగ్ బూత్‌ల్లో అవకతవకలు.. అదుపులో 13 మంది

మోతిహారిలోని ఢాకాలో ముగ్గురు నకిలీ ఓటర్ల పట్టివేత
మోతిహరి ఢాకా అసెంబ్లీ నియోజకవర్గంలోని కుండ్వాచైన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన హసీబుల్లా, సుల్తాన్ అహ్మద్, ఆసిఫ్ అన్వర్లను తమ అసలు గుర్తింపును దాచిపెట్టి మరొకరి పేరుతో నకిలీ ఓట్లు వేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై అరెస్టు చేశారు.

అరారియాలో బీజేపీ-కాంగ్రెస్ మద్దతుదారుల ఘర్షణ
ఎన్నికల రోజున కాంగ్రెస్ అభ్యర్థి కారుపై పార్టీ లోగో ఉన్న స్టిక్కర్ ఉండగా, బీజేపీ అభ్యర్థి వ్యతిరేకించారు
దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌

ఇప్పటి వరకు 60. 40 శాతం పోలింగ్ నమోదు:

పశ్చిమ చంపారన్- 61.99 శాతం
తూర్పు చంపారన్- 61.92 శాతం
షియోహర్ -61.85 శాతం
సీతామర్హి-58.32 శాతం
మధుబని-55.53 శాతం
సుపాల్-62.06 శాతం
అరారియా-59.80 శాతం
కిషన్ గంజ్-66.10 శాతం
పుర్నియా-64.22 శాతం
కతిహార్-63.80 శాతం
భాగల్ పూర్-58.37 శాతం
బంకా-63.03 శాతం
కైమూర్ (భాబువా)-62.26 శాతం
రోహ్తాస్-55.92 శాతం
అర్వాల్-58.26 శాతం
జెహానాబాద్-58.72 శాతం
ఔరంగాబాద్-60.59 శాతం
గయ-62.74 శాతం
నవాడా-53.17 శాతం
జమూయి-63.33 శాతం పోలింగ్

సొంత ఊరిలో ఓటేసిన పీకే

  • ఓటు హక్కు వినియోగించుకున్న జన్‌ సురాజ్‌ పార్టీ చీఫ్‌ ప్రశాంత్‌ కిషోర్‌
  • రోహ్తాస్ జిల్లా కర్గహర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కోనార్ గ్రామంలోని ఓటేసిన పీకే 
  • బిహార్‌ లో మార్పు కోసం ఓటేయాలంటూ పిలుపు 
  • ప్రతి ఓటు ముఖ్యమని, ప్రజలు ముందుకు వచ్చి తమ హక్కులను వినియోగించుకోవాలని విజ్ఞప్తి 
  • పీకే వెంట కర్గహర్ అభ్యర్థి.. గాయకుడు రితేష్ పాండే 

 

జెహానాబాద్ పోలింగ్‌ సెంటర్‌ వద్ద ఘర్షణ 

  • జెహానాబాద్‌ ఘోసీ అసెంబ్లీ నియోజకవర్గంలోని హర్దాస్ పూర్ గ్రామంలోని ఓ పోలింగ్‌ వద్ద రాజకీయ ఘర్షణ 
  • తన్నుకున్న ఇరు పార్టీల వర్గీయులు 
  • నలుగురికి గాయాలు 
  • పోలీసులు ఎంట్రీతో అదుపులోకి పరిస్థితి 

 

11 గం. దాకా ఓటింగ్‌ శాతం 31.38

కర్గహార్‌లో ఓటింగ్‌ బహిష్కరణ

  • రోహతాస్‌ జిల్లా కర్గహార్‌లో ఓటింగ్‌ బహిష్కరణ 
  • అఖోడి పంచాయతీలోని లడ్డుయి బిషన్పురా గ్రామంలో ఓటేయని ప్రజలు
  • 175, 176 బూత్ వద్ద కనిపించని ఓటర్‌ 
  • రంగంలోకి దిగి ఓటర్లను బతిమాలుతున్న అధికారులు 

కీలకంగా ముస్లిం ఓట్లు

  • మలివిడత పోలింగ్‌ కీలకంగా మారనున్న సీమాంచల్ నాలుగు జిల్లాలు 
  • అరరియా, కిషన్‌గంజ్, కటిహార్, పూర్నియా 
  • ముస్లిం జనాభా అధికంగా ఉండటంతో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ఆసక్తికర పోటీ
     

బిహార్‌కు అలాంటి మోడల్‌ అవసరం: ఖర్గే

  • బిహార్ ఓటర్లకు కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే పిలుపు
  • బిహార్‌కు ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన మోడల్ అవసరమని వ్యాఖ్య 
  • నితీశ్‌ కుమార్‌ సర్కార్‌పై ఖర్గే ఫైర్‌
  • మార్పునకు ఓటేయాలని ఓటర్లకు పిలుపు

నవాడాలో స్వల్ప ఉద్రిక్తత

  • నవాడా జిల్లాలోని వారిసలిగంజ్ పోలింగ్‌ బూత్‌ వద్ద రాజకీయ పార్టీల ఘర్షణ
  • అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి అదుపులోకి

బిహార్‌ పోలింగ్‌.. ప్రముఖ అభ్యర్థులు వీళ్లే..

  • బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (JD-U) — సుపౌల్ నుంచి 8వ సారి పోటీ.
  • ప్రీమ్ కుమార్ (BJP) — గయా టౌన్.
  • తర్కీషోర్ ప్రసాద్ — కటిహార్.
  • పార్టీ మారిన అభ్యర్థులు: సంగీతా కుమారి, విభా దేవి, మురారి గౌతమ్.

బిహార్‌లో 9 గంటల సమయానికి 14.5శాతం పోలింగ్‌

ఓటేసిన తర్వాతే టీ, టిఫిన్‌లు

  • బిహార్‌ ఓట్లకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పిలుపు 
  • మొదట ఓటు వేయండి, తర్వాత అల్పాహారం చేయండి అంటూ ట్వీట్‌ 
  • ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాకుండా బాధ్యత కూడా: నితీశ్‌ 
  • ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలి.. ఇతరులను కూడా ఓటేసేలా ప్రేరేపించాలి: నితీశ్‌ 

బిహార్‌ ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు

  • కొనసాగుతున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ 
  • బిహార్‌ ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు 
  • ఓటింగ్ రికార్డు స్థాయిలో జరగాలి అని ప్రధాని మోదీ ఆకాంక్ష
  • నవంబర్ 6న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 65% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైంది.. ఇది ఇప్పటివరకు అత్యధికంగా నమోదైన ఓటింగ్ 
  • ఈ సందేశం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని ప్రధాని పిలుపు


బిహార్ చివ‌రి విడ‌త ఎన్నిక‌ల పోలింగ్ ఇలా.. 

  • 122 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్
  • ఉద‌యం ఏడు గంట‌ల నుంచి సాయంత్రం ఆరుగంట‌ల వ‌ర‌కు పోలింగ్‌
  • బ‌రిలో ఉన్న 1302 మంది అభ్య‌ర్థులు
  • ఓటు హ‌క్కు వినియోగించుకోనున్న 3.7 కోట్ల మంది ఓట‌ర్లు
  • 45 వేల పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసిన  కేంద్ర ఎన్నిక‌ల సంఘం
  • చివ‌రి విడ‌త ఎన్నిక‌ల్లో 53 నియోజ‌క‌వ‌ర్గాల్లో బిజెపి, 44 చోట్ల జెడియు,  15 చోట్ల ఎల్‌జెపి, హెచ్ ఎ ఎం 6, ఆర్ ఎల్ ఎం 4 సీట్ల‌లో పోటీ
  • మ‌హ‌ఘ‌ట్‌బంద‌న్‌లో ఆర్జెడి 71,  కాంగ్రెస్ 37, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ 8, సిపిఎంఎల్ 6, సిపిఐ4, సిపిఎం 1 చోట పోటీకి పార్టీలు
  • ఆరు సీట్ల‌లో స్నేహపూర్వ‌క‌పోటీలో ఉన్న ఆర్జేడీ, కాంగ్రెస్‌, వీఐపీ, సీపీఐ పార్టీలు

సెకండ్‌ ఫేజ్‌లో..

  • 1,302 మంది అభ్యర్థులు బరిలో..
  • పోటీలో.. 1,165 మంది పురుషులు, 136 మంది మహిళలు. ఒక ట్రాన్స్‌జెండర్‌
  • ఓటర్లలో.. 1,95,44,041 మంది పురుషులు 
  • ఓటర్లలో.. 1,74,68,572 మంది మహిళలు


పోలింగ్‌ ఏర్పాట్లు ఇలా.. 

  • ఎన్నికల సిబ్బంది 4 లక్షల మంది    
  • 45,399 పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు 
  • సున్నిత ప్రాంతాల్లో ఓటింగ్‌ సమయం కుదింపు
  • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
  • నేపాల్‌ సరిహద్దులు ఈ నెల 11వ తేదీ వరకూ మూసివేత
  • 595 పోలింగ్‌ బూత్‌లలో అందరూ మహిళా అధికారులే బాధ్యతలు
  • 316 మోడల్‌ పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు
  • ఇంటి వద్ద ఓటేయనున్న 63,373 మంది 

రెండో విడతలో ఏ పార్టీ ఎన్నిచోట్ల..

ఎన్డీయే

బీజేపీ: 53
జేడీయూ: 44
ఎల్జేపీ: 15
ఆర్‌ఎల్‌ఎం: 4
హెచ్‌ఏఎం: 6

మహాఘట్‌బంధన్‌

ఆర్జేడీ: 71
కాంగ్రెస్‌: 37
వీఐపీ: 7
సీపీఐ: 4
సీపీఐ (ఎంఎల్‌): 6
సీపీఐ (ఎం): 1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement