పట్నా: ఆమెది పుణె. కాకపోతే బిహార్‌లో ఓటు వేసినట్లు ఆమెనే చెబుతోంది., మీరు కూడా బిహార్ వెళ్లి ఓటు వేయండి అని కూడా స్పష్టం చేసింది. ఆమె పేరు ఊర్మి. ఆమె ఒక న్యాయవాది. కాకపోతే బిహార్ తొలిదశ ఎన్నిక తర్వాత ఆమె షేర్ చేసిన ఫోటోపై రాజకీయ దుమారం రేగుతోంది. ‘ఎక్స్’ వేదికగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో అనేక ప్రశ్నలకు తావినిస్తోంది. నిజంగానే బిహార్‌లో ఆమె ఓటు వేసిందా?.. లేక ఇది డ్రామానా? అనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తే కానీ తెలియదు.
దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది. మల్లీ స్టేట్ వోటింగ్ అనేది బీజేపీకి న్యూ స్టార్టప్‌నే కాదు.. కొత్త పెట్టుబడి దారు కూడా అంటూ ఆ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ రేష్మ అలమ్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలకు మహారాష్ట్రలో ఓటు వేసిన ఆమె.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కోసం బిహార్‌లో ఓటు వేసిందని, ఇది ఓట్ చోరీ కాక మరేమిటని మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి అతుల్ లోందే పాటిల్ ద్వజమెత్తారు.
Voted for a Modi-fied India! 🇮🇳
Jaai ke Vote daali, Bihar! pic.twitter.com/kkWMwShqSh— Urrmi (@Urrmi_) November 6, 2025
ఈ ఫోటోపై ఓటరు గుర్తింపు, నివాస ప్రమాణాలు, ఎన్నికల నిబంధనలు ప్రకారం విచారణ జరగవలసిన అవసరం ఉంది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బ్రెజిలియన్ మోడల్ ఫోటోతో హర్యానాలో పలు ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పుడు బిహార్ ఎన్నికకు సంబంధించి తాజా ఫోటో వైరల్ కావడంతో ఎన్నికల పారదర్శకతకు సంబంధించి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
लोकसभा में महाराष्ट्र में वोट करूंगी
विधानसभा में बिहार में वोट करूंगी
मोदी के लिए वोट चोरी करूंगी 🧐🧐 pic.twitter.com/xDrrLoXMbj— Atul Londhe Patil (INDIA Ka Parivar)🇮🇳 (@atullondhe) November 6, 2025
ఇవీ కూడా చదవండి:


