న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా రాజధానిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, హర్యానాలో జరిగిన ఓటు చోరీ గురించి పలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపధ్యంలోనే ఆయన బ్రెజిలియన్ మోడల్( లారిస్సా) హర్యానాలో 22 సార్లు ఓటు వేశారని ఆరోపించారు.
రాహుల్ ఆరోపణలపై బ్రెజిలియన్ మోడల్ లారిస్సా స్పందిస్తూ ఇది నమ్మశక్యంగా లేదని అన్నారు. తన వాదనను ఆమె ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్టు చేస్తూ వివరించారు. భారతదేశంలో ఎన్నికల ప్రయోజనాల కోసం తన చిత్రాన్ని దుర్వినియోగం చేయడంపై ఆమె ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఆమె పోర్చుగీస్ భాషలో మాట్లాడుతూ ‘గైస్, నేను మీకు ఒక జోక్ చెబుతాను... ఇది చాలా విచ్రితమైనది.. వారు నా పాత ఫొటోను ఉపయోగించారు. అది నా చిన్నప్పటిది. భారతదేశంలో ఓటు వేయడానికి నా ఫొటోను వాడారు. ఒకరితో ఒకరు పోరాడేందుకు నన్ను భారతీయురాలిగా చిత్రీకరించారు. ఎంత పిచ్చి పనో చూడండి’ అని అన్నారు.
The name of the Brazilian Model seen in @RahulGandhi's press conference is Larissa. Here's her reaction after her old photograph went viral. pic.twitter.com/K4xSibA2OP
— Mohammed Zubair (@zoo_bear) November 5, 2025
ఈ వీడియోలో లారిస్సా.. ఒక రిపోర్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనను భారతదేశ ఎన్నికల్లో ఓటు వేయడం గురించి అడిగారని వెల్లడించారు. ఇదేవిధంగా తన స్నేహితుడొకరు ఇదే ఫొటోను పంపారన్నారు. ఇది ‘నమ్మశక్యం కానిది’, ‘వింతైనది’ అని ఆమె పేర్కొన్నారు. కాగా బ్రెజిలియన్ మోడల్ లారిస్సా పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
LIVE: #VoteChori Press Conference - The H Files https://t.co/IXFaH9fEfr
— Rahul Gandhi (@RahulGandhi) November 5, 2025
ఇది కూడా చదవండి: ‘ఏడు కాదు ఎనిమిది’.. ట్రంప్ సరికొత్త వాదన


