కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం జర్మనీలోని మ్యూనిచ్‌లోని ఆటోమొబైల్ దిగ్గజం BMW ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా భారతదేశంలో క్షీణిస్తున్న తయారీరంగంపై విచారం వ్యక్తం చేశారు. తన జర్మనీ పర్యటన సందర్భంగా రాహుల్ BMW కారు నడుపుతూ దాని, ఫీచర్ల గురించి తెలుసుకుంటూ కనిపించారు. దుబాయ్‌కు చెందిన ఒక కుటుంబంతో సహా అనేక మంది భారతీయులతో కూడా ఆయన సంభాషించారు సందర్శకులతో చిత్రాలకు పోజులిచ్చారు. రాహుల్ గాంధీవీడియోను కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.
BMWతో భాగస్వామ్యంతో భారత్ అభివృద్ధి చేసిన TVS 450cc మోటార్ సైకిల్‌ను చూసి గాంధీ సంతోషించారు. భారతీయ ఇంజనీరింగ్‌ను నైపుణ్యాన్ని ఇక్కడ చూడటం గర్వకారణమన్నారు.
అయితే తయారీ బలమైన ఆర్థిక వ్యవస్థలకువెన్నెముక. విచారకరంగా, భారతదేశ తయారీ రంగం క్షీణిస్తోంది. వృద్ధిని వేగవంతం చేయడానికి, మరింత ఉత్పత్తి చేయాలని, అర్థవంతమైన తయారీ పర్యావరణ వ్యవస్థలను నిర్మించాలని, అధిక-నాణ్యత ఉద్యోగాలను సృష్టించాలని గాంధీ పేర్కొన్నారు.
కాగా కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 5 రోజుల జర్మనీ పర్యటన సందర్భంగా బెర్లిన్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు IOC (ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్) బృందం ఆయనకు ఘన స్వాగతం పలికింది. యూరప్‌లోని IOC నాయకులను రాహుల్ కలుస్తారు. NRIలతో భేటీ అయ్యి, వారి సమస్యలపై, పార్టీ సిద్ధాంతాన్ని మరింతగా వ్యాప్తి చేయాలనే దానిపై చర్చలు జరుపుతారు.


