తీరు మార్చుకోకుంటే.. బంగ్లాదేశ్‌కు దబిడి దిబిడే..! | Specal Story On Bangladesh Controversy Comments over india | Sakshi
Sakshi News home page

తీరు మార్చుకోకుంటే.. బంగ్లాదేశ్‌కు దబిడి దిబిడే..!

Dec 21 2025 8:17 PM | Updated on Dec 21 2025 8:38 PM

Specal Story On Bangladesh Controversy Comments over india

బంగ్లాదేశ్‌.. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం నడుస్తుంది. బంగ్లాదేశ్‌ ప్రధానిగా షేక్‌ హసీనాను గద్దె దించిన తర్వాత అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.  ఆ ప్రభుత్వానికి చీఫ్‌ అడ్వైజర్‌గా మహ్మద్‌ యూనస్‌ అన్నీతానై వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దేశ నేతలు చేసే వ్యాఖ్యలు పొరుగెన ఉన్న భారత్‌ను రెచ్చగొట్టేలా ఉన్నాయి.  గతంలో భారత్‌ చేసిన త్యాగాన్ని మరిచి మరీ బంగ్లాదేశ్‌ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తుంది. బంగ్లాదేశ్‌ ఏర్పాటులో భారత్‌ది కీలక పాత్ర అనేది చరిత్రను అడిగితే చెబుతుంది,. మరి అటువంటిది బంగ్లాదేశ్‌ నాయకులు కావాలనే కయ్యానికి కాలుదువ్వుతున్నట్లే ఉంది. 

నిశితంగా గమినిస్తున్న భారత్‌..
కొంతకాలం క్రితం మహ్మద్‌ యూనస్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఉన్న సెవెన్‌ సిస్టర్స్‌ అని పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాల గురించి బంగ్లాదేశ్‌ తెగ ఆరాటపడిపోతంది. ఆ తరహా వ్యాఖ్యలే ఇప్పుడు ఆ దేశంలో పలువురి నేతల వెంట కూడా వస్తుంది. ఈ వ్యవహారాల్ని గమనిస్తు ఉన్న భారత్‌.. వారి వ్యవహార శైలిని ఎండగడుతూనే ఉంది.  ఒకనాడు పాకిస్తాన్‌కు మోకరిల్లేలా చేసి బంగ్లాదేశ్‌ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన భారత్‌..  బంగ్లాదేశ్‌ నాయకులు చేస్తున్న ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు అనే దానిపై ఫోకస్‌ పెట్టింది. ఎటువంటి బలం లేకుండా బంగ్లాదేశ్‌ ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయదని పసిగట్టిన భారత్‌.. ‘వారి వెనుక ఎవరున్నారు’ అనే విషయంపై కన్నేసి ఉంచింది. 

గతంలోనే ప్రధాని మోదీ వార్నింగ్‌..!
ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో మహ్మద్ యూనస్‌ భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు అప్పుడే భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.  ఏప్రిల్‌ నాల్గో తేదీన థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్  వేదికగా జరిగిన బిమ్ స్టెక్(BIMSTEC) సమ్మిట్ కు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో కలిసి హాజరైన ప్రధాని మోదీ.. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్‌ యూనస్‌ తో భేటీ అయిన సందర్భంగా మోదీ క్లియర్‌ కట్‌ వార్నింగ్‌ ఇచ్చారు.  ‘మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. భారత్ కు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమ్మతం కాదు. ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయి’ అంటూ ప్రధాని మోదీ నేరుగా స్పష్టం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు.

 ఆనాడు యూనస్‌ ఏమన్నారంటే..
ఏప్రిల్‌ మొదటి వారంలో యూనస్‌.. భారత్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్సద వ్యాఖ్యలు చేసి చైనా మెప్పు పొందాలనే యత్నం చేశారు. సెవన్‌ సిస్టర్స్‌గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని,. సముద్ర తీరమున్న ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు బంగ్లాదేశ్‌ సాగర రక్షకుడిగా  ఉందని, చైనాకు ఇదొక మంచి అవకాశమన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ దీని ద్వారా మరింత బలోపేతం చేసుకోవచ్చన్నారు. చైనా సాయం కోసం, వారి మెప్పు కోసం యూసఫ్‌ తెగ తంటాలు పడిపోతున్నారు. అవకాశవాదానికి మారుపేరైన చైనా వాపును చూసే యూనస్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆనాడే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. 

భారత్‌పై మరోసారి పరోక్షంగా అక్కసు..
శనివారం రాడికల్ నేతగా పేరున్న షరీఫ్ ఒస్మాన్ హాది అంత్యక్రియల్లో పాల్గొన్నముహమ్మద్ యూనస్..హాది ఆలోచనలు, సిద్ధాంతాలను తరతరాలకు కొనసాగిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.  ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలో ఆయన చూపిన మార్గాన్ని తాము స్వీకరించామని తెలిపారు. హాది ఇచ్చిన స్పూర్తి ప్రజాజీవితంలో సజీవంగా కొనసాగుతుందన్నారు. అంటే భారత్‌పై పరోక్షంగా యూనస్‌ వ్యాఖ్యానించట్లైంది. 

భారత వ్యతిరేక శక్తిగా, భారతే టార్గెట్‌గా హాది వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు ఆయన మార్గాన్ని బంగ్లాదేశీయుల అనుసరిస్తున్నారని యూనస్‌ అంటున్నారు. అంటే  ఆ అంత్యక్రియల కార్యక్రమం భారత వ్యతిరేక కార్యక్రమంలానే ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరో చోటా నేత సైతం..
బంగ్లాదేశ్‌కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) నేత హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’ను భారతదేశం నుండి వేరు చేస్తామంటూ హస్నత్ అబ్దుల్లా చేసిన రెచ్చగొట్టే ప్రకటన చేశాడు.  దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ  కూడా తీవ్రంగా స్పందించింది. బుధవారం బంగ్లాదేశ్ హైకమిషనర్‌ను పిలిపించి భారత్ తన బలమైన నిరసనను వ్యక్తం చేసింది.

పాక్‌ను మోకరిల్లేలా చేసిన వేళను మరిచారా?
1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశీయులపై ఊచకోత జరిపారు. ఇది ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద జనసంహారంగా గుర్తించబడింది. సుమారు 300,000 నుండి 3,000,000 మంది వరకు బంగ్లాదేశీయులు హతమయ్యారని అంచనా.  పాకిస్తాన్ సైనికులు, వారికి సహాయం అందించిన స్థానికుల చేత 200,000 నుండి 400,000 వరకూ అత్యాచారం బారిన పడ్డారు. సుమారు 30 మిలియన్ల మంది తమ ఇళ్లను వదిలి శరణార్థులుగా మారారు. ఈ సమయంలో పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది భారత్‌కు.   ఆనాడు భారత్‌కు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ సాహోసపేతమైన నిర్ణయంతో పాకిస్తాన్‌ ఆటనును 13 రోజుట్లోనే కట్టించింది. 

డిసెంబర్‌ 3వ తేదీన మొదలైన యుద్ధం డిసెంబర్‌ 16వ తేదీకి ముగిసింది. 1971లో జరిగిన 13 రోజుల యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్‌పై సాధించిన విజయంతో ఈస్ట్‌ పాకిస్తాన్‌ కాస్తా బంగ్లాదేశ్‌గా మారింది. ఆ సమయంలో సుమారు 93 వేల మంది పాక్‌ సైన్యం ఢాకాలో లొంగిపోయింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైనిక లొంగబాటుగా కూడా రికార్డులెక్కింది.  పాకిస్తాన్‌ను మోకరిల్లేలా చేసి బంగ్లాదేశ్‌ అనే రాజ్యం ఏర్పాటుకు భారత్‌ ఇంతటి త్యాగం చేస్తే.. మరి ఇప్పుడు దానిని మరిచి కాలుదువ్వడానికి సిద్దం కావడం. ఒకటైతే.. అప్పుడ పాకిస్తాన్‌కు ఎదురైన అతి పెద్ద పరాభవం.. నేటి బంగ్లాదేశ్‌ ఎదురు కాదనేది వారు అనుకుంటే పొరపాటే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement