పాట్నా: ఇటీవల బిహార్ ఎన్నికల్లో ఎన్‌డీయే కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో బిహార్ సీఎం అభ్యర్థి ఉత్కంఠ వీడింది. రేపు బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధిపతి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా బిజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయనున్నారంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాణస్వీకార వేడుక పాట్నాలోని గాంధీ మైదానంలో ఉదయం 11.30 నిమిషాలకు జరగనుంది.
అయితే, బిహార్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై.. ఎన్‌డీఏ కూటమి నేతలు ఆధిక్యంలో ఉండగా రాష్ట్రానికి తదుపరి సీఎం ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది ఆ సమయంలో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నితీష్ కుమారేనంటూ జేడీయూ ట్వీట్ చేసింది. కొద్ది సేపటికి ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. దీంతో మహరాష్ట్ర తరహా పాలిటిక్స్‌ను కమలం పెద్దలు బిహార్‌లో అప్లయి చేస్తున్నారనే ఊహాగానాలు కొనసాగుతూ వచ్చాయి.
ఈ క్రమంలో బుధవారం ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూటమి నేతలు బిహార్ సీఎంగా నితీష్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. నితీష్ కుమార్ తదపరి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమైంది. రేపే నితీష్ ప్రమాణ స్వీకారమహోత్సవానికి ప్రభుత్వం అంగరంగవైభవం ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు వెలుగులోకి వచ్చిన జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి.


