పాట్నా: పహల్గాంకు ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైనిక దళాలు పీవోకే,పాకిస్తాన్‌లో ఉగ్రశిబిరాల్ని కూల్చేస్తుంటే కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీకి నిద్ర కరువైందని ఆరోపించారు. ఆదివారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
మరో నాలుగు రోజుల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అరాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోదీ కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. సభలో మోదీ మాట్లాడుతూ.. ‘ఇటీవలే మనం ‘ఆపరేషన్ సిందూర్' నిర్వహించాం. మనం హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీని నెరవేర్చాం. ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన సైనికుల్ని ప్రతి భారతీయుడు గర్వించాలి. కానీ సైన్యం విజయం సాధించినా, కాంగ్రెస్, ఆర్జేడీ మాత్రం అసంతృప్తిగా ఉన్నాయి’అని ఎద్దేవా చేశారు.
పాకిస్తాన్‌లో ఆపరేషన్ సిందూర్ సమయంలో కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ నిద్రపోలేకపోయింది. ఇప్పటికీ పాకిస్తాన్, కాంగ్రెస్ నామ్దార్లు 'ఆపరేషన్ సిందూర్' నుంచి కోలుకోలేకపోతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎన్‌డీఏ మేనిఫెస్టోను ‘బిహార్ సమగ్ర అభివృద్ధికి హామీ’గా అభివర్ణించారు. మీ ఉత్సాహాన్ని చూస్తే ‘వికసిత బిహార్’ లక్ష్యం పట్ల నా సంకల్పం మరింత బలపడుతోందని వ్యాఖ్యానించారు.
భారత్ ఉగ్రవాదాన్ని సహించదు
పాక్ ఉగ్రవాదులు పహల్గామ్ టూరిస్టులపై దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 26మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకు ప్రతీకారంతో భారత్ ఆపరేషన్ సిందూర్ పాక్,పీవోకేలో ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేసింది. వందల్లో ఉగ్రవాదుల్ని ముట్టుబెట్టింది. ప్రధాని మోదీ పలహల్గాం ఉగ్రదాడి ‘ఉగ్రవాదంలో అత్యంత క్రూరమైన రూపం’గా అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదంపై భారత పోరాటంలో కొత్త అధ్యాయం. ఇకపై భారత్ ఉగ్రవాదాన్ని సహించదు’అని స్పష్టం చేశారు.


