నగ్రోటా: జమ్ముకశ్మీర్‌లోని నగ్రోటా అసెంబ్లీ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి చెందిన దేవయాని రాణా 42,350 ఓట్లతో విజయం సాధించారు. జమ్ముకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్ష్ దేవ్ సింగ్ 17,703 ఓట్లతో ఆమె చేతిలో ఓడిపోయారు. జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన షమీమ్ బేగం 10,872 ఓట్లు దక్కించుకున్నారు. జమ్ముకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అగా సయ్యద్ ముంతాజీర్ మెహదీ బుడ్గాం అసెంబ్లీ ఉప ఎన్నికలో స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గండేర్బల్ స్థానాన్ని నిలుపుకునే ఉద్దేశంతో రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది.


