సమస్తీపూర్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో సమస్తీపూర్ జిల్లాలో రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో వీవీపాట్ స్లిప్‌లు లభమయ్యాయి. ఈ నేపధ్యంలో ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేసి, అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
జిల్లాలోని సరైరంజన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఒక కళాశాల సమీపంలో రోడ్డు పక్కన చెల్లాచెదురుగా వీవీపాట్ స్లిప్‌లు కనిపించాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టింది. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో జిల్లా మేజిస్ట్రేట్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, ఈ ఉదంతంపై విచారణ జరపాలని ఆదేశించింది. స్థానికంగా పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా ఈ విషయమై డీఎంకు సమాచారం అందించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఆర్‌ఓను సస్పెండ్ చేశారని, అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.


