అమృత్‌సర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని మరో ఎనిమిది నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికలకు నేడు(శుక్రవారం) కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ సరిహద్దు జిల్లా తార్న్ తరణ్ ఉప ఎన్నికల ఫలితాల్లో ‘ఆప్’ ముందంజలో ఉంది.
ఈ ఫలితాల తీర్పు పంజాబ్‌లో 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కీలక సూచికగా పరిగణిస్తున్నారు. తార్న్ తరణ్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీదారులుగా ఆప్‌నకు చెందిన హర్మీత్ సింగ్ సంధు, బీజేపీకి చెందిన హర్జిత్ సింగ్ సంధు, ఎస్‌ఏడీకి చెందిన సుఖ్‌విందర్ కౌర్ రాంధావా, కాంగ్రెస్‌కు చెందిన కరణ్‌బీర్ సింగ్ బుర్జ్ నిలిచారు. వీరంతా ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఆప్ ఎమ్మెల్యే డాక్టర్ కశ్మీర్ సింగ్ సోహల్ మృతితో ఈ స్థానంలో ఉప ఎన్నిక తప్పనిసరి అయింది.


