సర్వం సిద్ధంచేసిన ఈసీ
1,314 అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న 3.75 కోట్ల మంది ఓటర్లు
పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి దశలో 121 నియోజకవర్గాల్లో హోరాహోరీగా ప్రచారం జరగ్గా నేడు పోలింగ్ అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మొదలుకానుంది. అధికార ఎన్‌డీఏ, విపక్షాల మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థులు సహా మొత్తం 1,314 అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు తొలి దశలో 3.75 కోట్ల మంది ఓటర్లు సిద్ధమయ్యారు.
గురువారం మొత్తంగా 45,241 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. వీటిల్లో 36,733 కేంద్రాలు గ్రామీణప్రాంతాల్లో ఉండటం గమనార్హం. గురువారం ఓటేస్తున్న వారిలో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. విపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, బీజేపీ నేత, ప్రస్తుత డెప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పోటీచేస్తున్న నియో జకవ ర్గాల్లోనూ గురువారం తొలిదశలోనే పోలింగ్ జరగనుంది.
రాఘోపూర్‌లో హ్యాట్రిక్ కోసం తేజస్వీ కన్నేయగా, 2010లో రబ్రీ దేవిని ఓడించిన బీజేపీ నేత సతీశ్ కుమార్ ఈసారి తేజస్వీని ఓడించాలని తహతహలా డుతున్నా రు. రాఘోపూర్‌లో ఎలాగైనా తేజస్వీని ఓడించాలని జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కంకణం కట్టుకున్నారు. పొరుగు నియోజకవర్గంలో తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ సైతం సొంతంగా జశక్తి జనతాదళ్ పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రి అయిన విజయ్ కుమార్ సిన్హా సైతం లఖీసరాయ్‌లో నాలుగోసారి గెలుపుపై గంపెడాశలు పెట్టుకు న్నారు. జనసురాజ్ పార్టీ కార్యకర్త హత్య కేసులో అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ పోటీచేస్తున్న మొఖానాలోనూ గురువారమే పోలింగ్ జరగనుంది. ఇక్కడ ఆర్జేడీ తరఫున వీణాదేవి పోటీచేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘట నలు జరక్కుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు, పోలీసులు తెలిపారు.


