breaking news
first phase of Bihar elections
-
నేడు బిహార్‌లో మొదటి దశ పోలింగ్
పట్నా: నేడు బిహార్‌లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. 71 అసెంబ్లీ స్థానాల్లో 1,066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని దాదాపు 2 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలను సజావుగా జరిపేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఒక్కో పోలింగ్‌బూత్‌కు గరిష్టంగా ఉన్న ఓటర్ల సంఖ్యను 1,600 నుంచి 1,000కి తగ్గించింది. 80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించింది. ఈవీఎంలను తరచుగా శానిటైజ్ చేయనుంది. ఓటర్లు, సిబ్బందికి మాసు్కల ధారణ తప్పనిసరి చేసింది. అభ్యర్థుల్లో 952 మంది పురుషులు, 114 మంది మహిళలు ఉన్నారు. వీరిలో జేడీయూ తరఫున 35 మంది, బీజేపీ తరఫున 29 మంది పోటీ చేయనున్నారు. ఆర్జేడీ తరఫున 42 మంది, కాంగ్రెస్ తరఫున 20 మంది బరిలో దిగనున్నారు. ఎల్జేపీ 41 చోట్ల పోటీ చేస్తుండగా, జేడీయూ పోటీ చేస్తున్న 35 చోట్లా అభ్యర్థులను నిలిపింది. కేబినెట్ మంత్రుల్లో 6 మంది ఈ దశలో బరిలో నిలిచారు. రెండో దశ పోలింగ్ నవంబర్ 3న, మూడో దశ పోలింగ్ నవంబర్ 7న, ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి. -
నితీశ్ మోసాల్లో మాస్టర్
బిహార్ సీఎంపై బీజేపీ చీఫ్ అమిత్ షా ధ్వజం పట్నా: బిహార్ తొలిదశ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎన్డీయే, మహా కూటమి పక్షాలు ప్రత్యర్థులపై విమర్శలను తీవ్రం చేశాయి. రాష్ట్రంలో పలు చోట్ల ఆదివారం జరిగిన సభల్లో ఇరుపక్షాల నేతలు పాల్గొన్నారు. స్కామ్‌లకు, ఆటవిక పాలనకు ఆలవాలమైన కాంగ్రెస్, ఆర్జేడీలను భుజాలపై మోస్తూ బిహార్‌ను అభివృద్ధి చేయడం జేడీయూ నేత నితీశ్ కుమార్‌కు సాధ్యం కాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ‘యూపీఏ హయాం నాటి రూ. 12 లక్షల కోట్ల అవినీతితో కాంగ్రెస్, 15 ఏళ్ల ఆటవిక పాలనతో ఆర్జేడీ ఉన్నాయి. వాటిని మోస్తూ నితీశ్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలడు?’ అని ప్రశ్నించారు. మోసపూరిత రాజకీయాల్లో నితీశ్ నిపుణుడని, రామ్మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, బీజేపీ, తాజాగా జతిన్ రామ్ మాంఝీలను ఆయన మోసం చేశారని ఆరోపించారు. నితీశ్, లాలూ ప్రసాద్‌ల మహాకూటమి అధికారంలోకి రావడమంటే రాష్ట్రంలో జంగిల్ రాజ్-2 ప్రారంభమయినట్లేనని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని, అందువల్ల బీజేపీ మిత్రపక్షాలను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే బిహార్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుతుందన్నారు. హిందువులు కూడా గోమాంసం తింటారన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ వ్యాఖ్యలపై నితీశ్‌కుమార్, సోనియాగాంధీ తమ వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ డిమాండ్ చేశారు. గోవుల పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. లాలూ వ్యాఖ్య యదు వంశీయులను(యాదవులు) అవమానించడమేనని బీజేపీ ఎంపీ హుకుందేవ్ ధ్వజమెత్తారు. బీజేపీని ఓడించండి: రాం జఠ్మలానీ పట్నా: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ఆ పార్టీ మాజీ నేత, ప్రముఖ న్యాయవాది రాం జఠ్మలానీ బిహారీలను కోరారు. ప్రధాని మోదీ సైనిక దళాలను, ప్రజలను మోసం చేశారని, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీని ఓడించి, తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నితీశ్ సీఎం కావడం కోసం మహాకూటమిని గెలిపించాలన్నారు. ‘ఒకే ర్యాంకు, ఒకే పింఛను’కు డిమాండ్ చేస్తున్న మాజీ సైనికులను ఆయన ఆదివారమిక్కడ కలుసుకుని మద్దతిచ్చారు. ‘మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీల ఆటలో బలయ్యాను. ఎన్నికలకు ముందు వారికి మద్దతిచ్చి తప్పుచేశాను. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే ఇక్కడకు వచ్చాను’ అని వ్యాఖ్యానించారు. నల్లధనవంతుల పేర్లు బయటికి రావాలంటే, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, అరుణ్‌జైట్లీలను అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయాలన్నారు.