బిహార్ తొలి దశ ఎన్నికల పోలింగ్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లఖిసరాయ్‌లో బీజేపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఆయన ఖోరియారి గ్రామంలోకి ప్రవేశిస్తున్న సమయంలో విజయ్ కుమార్ సిన్హా కారును చుట్టుముట్టిన ఆర్జేడీ మద్దతు దారులు కాన్వాయ్‌పై చెప్పులు కూడా విసిరారు. ఆర్జేడీ మద్దతుదారులు తనపై దాడి చేశారంటూ విజయ్ సిన్హా మండిపడ్డారు. గూండాలు నన్ను గ్రామానికి వెళ్లనివ్వడం లేదు. నా పోలింగ్ ఏజెంట్‌ను గ్రామంలోకి అనుమతించలేదు. ఓటు వేయనివ్వలేదు. మా పోలింగ్ ఏజెంట్‌ను తరిమికొట్టారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రి అయిన విజయ్ కుమార్ సిన్హా సైతం లఖీసరాయ్‌లో నాలుగోసారి గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్నారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. అధికార ఎన్‌డీఏ, విపక్షాల మహాగఠ్‌బంధన్ కూటమి అభ్యర్థులు సహా మొత్తం 1,314 అభ్యర్థుల భవితవ్యం మొదటి దశలో తేలనుంది. 45,241 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. వీటిల్లో 36,733 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
ఇవాళ ఓటేస్తున్న వారిలో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. విపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, బీజేపీ నేత, ప్రస్తుత డెప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పోటీచేస్తున్న నియోజకవ ర్గాల్లోనూ గురువారం తొలి దశలోనే పోలింగ్ జరుగుతోంది.
#WATCH | #BiharElection2025 | RJD supporters surround Deputy CM and BJP candidate from Lakhisarai constituency, Vijay Kumar Sinha's car, hurl slippers and chant "Murdabad", forbidding him from going ahead. Police personnel present here.
Visuals from Lakhisarai. pic.twitter.com/qthw0QWL7G— ANI (@ANI) November 6, 2025


