అఖిల భారత పంచాయత్ పరిషత్ 18 వ జాతీయ మహాసభల్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో గదగ్ మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ డెవలప్మెంట్ యూనివర్సిటీ లో జరిగిన సభలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జనరల్ సెక్రటరీ, ఆంధ్ర ప్రదేశ్ AIPP అధ్యక్షులు M. చిదంబర రెడ్డి ప్రసంగిస్తూ...స్థానిక సంస్థల అవశ్యకతను, సర్పంచుల విధులు, నిధులు, విడుదల పై చర్చించి 2011 సెన్సెస్ ప్రకారం కేంద్ర నిధులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నారని, అప్పటి జనాభా అవసరాలకు, ఇప్పుటి 2025. జనాభా అవసరాలకు సరిపడా సదుపాయాలకు 4 రెట్లు పెరిగినది కావున గ్రాంట్ 4 రెట్లు పెంచవలసిన అవసరం ఉందని, ఇండియా 1 అని నాయకులు మాటలు చెప్తున్నారని, దేశం అంతా పంచాయతీ చట్టాలు ఒకే రకంగా ఉండాలని, అయితే ఒకో రాష్ట్రం లో ఒక విధంగా అమలు చేస్తున్నారని, కేరళ రాష్ట్రంలో మాత్రమే సర్పంచుల విధులు చాలా బాగున్నాయని, గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉద్యోగులు, వారి జీతాలు, పని తీరు సర్పంచుల ఆదేశాలు మేరకే జరుగుతాయని.గ్రామాలకు MLA,MP నిధులు వినియోగించాలి అంటే గ్రామ సభ, సర్వ సభ్య సమావేశం లో పంచాయతీ రిజల్యూషన్ ద్వారా అధికారులు నడుచుకుంటారు.

స్థానిక సంస్థలలో (సర్పంచి /ఎంపిటిసి/కౌన్సిలర్/జడ్పీటీసీ/కార్పొరేటర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు కనీస విద్యార్థత ఉండేలా చట్టం తేవాలని, గౌరవ వేతనం దేశం మొత్తం ఒకే విధంగా ఉండాలని,MLA,MP,MLC లకు పింఛను రిటైర్డ్ అయినాక స్థానిక సంస్థల ప్రతినిధులకు ఇచ్చే చట్ట సవరణ చేయాలని , గత ప్రభుత్వం లో మాజీ ముఖ్యమంత్రి గౌ.శ్రీ.YS జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో సచివాలయం, హాస్పిటల్, రైతు భరోసా,గ్రంథాలయం, డైరీ ల సముదాయాలు ఏర్పాటు చేసి దాదాపు ప్రతి గ్రామంలో 11 నుంచి 13 మంది ఉద్యోగులు పని చేసేలా చేశారు. ప్రతి రోజూ ఈ సముదాయాలకు వందల సంఖ్యలో ప్రజలు తమ అవసర నిమిత్తం వందలాదిగా వచ్చేవారు. ప్రభుత్వం మార్పు వల్ల, ఇప్పటి ప్రభుత్వo ఉద్యోగులను కుదించి మరీ అన్యాయంగా ఒకరో, ఇద్దరో వస్తున్నారు. ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుందని, ఉద్యోగులను నియామకం చేయాలని. పై విషయాల పై కమిటీ చర్చించి.. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి గారి దృష్టి కి మరియు ప్రధాన మంత్రి గారిని మనం కలవాల్సిన అవసరం ఉందని అఖిల భారత పంచాయత్ పరిషద్ అధ్యక్షులు, మాజీ యూనియన్ మినిస్టర్ శ్రీ సుభోద్ కాంత్ సహాయి గారిని కోరగా.. సభలో అందరూ సహకారం అందిస్తామని చెప్పారు


