ఆ పార్టీ నేతలు పేరుకే గాంధీలు
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
నిర్మల్: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆందోళన అర్థరహితమని, కొత్త పేరులో ‘రామ్’ అనే పదం ఉన్నందునే ఆ పార్టీ అభ్యంతరం చెబుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరో పించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులుగా గెలిచిన బీజేపీ మద్దతుదారులను నిర్మల్‌లో శుక్రవారం సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ గతంలో వందరోజులు మాత్రమే ఉన్న ఉపాధిహామీ పథ కాన్ని కేంద్రం 125 రోజులకు పెంచిందన్నారు.
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను వికసిత్ భారత్–జీ రామ్‌జీగా మార్చడంతో ఎవరికీ నష్టం లేదని తెలిపారు. రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ ఉపాధి పథకం కొత్తపేరులో ‘రామ్’ అనే పదం ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతోందన్నారు. ఆ పార్టీలో ఉన్నది నిజమైన గాంధీలు కాదని విమర్శించారు. కేవలం పేరుకు మాత్రమే గాంధీ అని పెట్టుకున్నా రని, ప్రేమ ఏమాత్రమూ లేదని ఆరోపించారు.
అందుకే.. అఖిలేశ్ వాళ్లని కలిశారు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనని రాంచందర్‌రావు ఆరోపించారు. అందుకే ఇటీవల సమాజ్ వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ సీఎం రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌ను కలిశారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వి నియోగానికి పాల్పడిందని ఆరోపించారు. బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల గెలుపు స్ఫూర్తితో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు. కార్యక్రమంలో బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్, ఎమ్మెల్యేలు రామారావుపటేల్, పాల్వాయి హరీశ్‌బాబు పాల్గొన్నారు.


