భారత రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. భారత రక్షణ వ్యవస్థను మరింత బలపరిచేందుకు ఆధునాతన ఆయుధాల కొనుగోలుకు అనుమతిచ్చింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన భేటీలో రూ.79 వేల కోట్ల విలువగల ఆయుధాల కొనుగోలుకు అనుమతులిచ్చారు.
ఈ నిధులతో ఇండియన్ ఆర్మీకి సంబంధించి నాగ్ మిసైల్ సిస్టమ్ . నేవీకి సంబంధించి ల్యాండింగ్ ప్లాట్‌ఫార్మ్ డాక్స్ నిర్మాణం, నావల్ సర్పేస్ గన్, అడ్వాన్స్ లైట్ వెయిట్ టార్పెడో తదితర యుద్ధ సామాగ్రి కొనుగోలుచేయనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. నాగ్ క్షిపణి వ్యవస్థను ఆర్మీ వాహనాలపై మోహరిస్తారు.ఈ క్షిపణులుశత్రు ట్యాంకులు, బంకర్లు మరియు ఇతర బలవర్థకమైన గోడలను నాశనం చేయగలవు.
నేవీకి సంబంధించి ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్స్ నిర్మించనున్నారు. సముద్రం నుండి భూమి మీద చేసే దాడులను ఇవి సులభతరం చేస్తాయి. అంతేకాకుండా ఇవి శాంతి పరిరక్షణ కార్యక్రమాలు, ఇతర సహాయం విపత్తు నిర్వహణకు ఉపయోగపడతాయి. వీటితో పాటు నావల్ సర్ఫేస్ గన్ మరియు అడ్వాన్స్‌డ్ లైట్ వెయిట్ టార్పెడోలను కొనుగోలు చేయనున్నారు. ఇవి ఇది అణు మరియు తేలికపాటి జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకోని దాడి చేయగలవు.
ఎయిర్‌ఫోర్స్‌ని ఆధునీకరించడానికి కొలాబరేటివ్ లాంగ్ రేంజ్ టార్గెట్ సాచురేషన్ అండ్ డిస్ట్రక్షన్ సిస్టమ్‌ను కొనుగోలు చేయనున్నారు. ఈ వ్యవస్థ విమానం టేకాఫ్, ల్యాండ్, నావిగేట్, లక్ష్యాలను గుర్తించడంతో పాటు మరియు పైలట్ లేకుండా దాడి చేయడానికి సహకరిస్తుంది. ఈ ఆయుధాల ఆదునీకరణ కేవలం యుద్ధ సమయంలోనే కాకుండా రక్షణ, సహాయక చర్యలు, శాంతి మిషన్లు, విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతాయని అధికారులు పేర్కొన్నారు.
అంతేకాకుండా వీటిలో చాలా మట్టుకు భారత్‌లోనే తయారవుతున్నాయని దీనివల్ల మేకిన్ ఇండియాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.


