breaking news
ministrey
-
రక్షణ శాఖ కీలక నిర్ణయం.. ఆయుధాల అప్‌గ్రేడ్
భారత రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. భారత రక్షణ వ్యవస్థను మరింత బలపరిచేందుకు ఆధునాతన ఆయుధాల కొనుగోలుకు అనుమతిచ్చింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన భేటీలో రూ.79 వేల కోట్ల విలువగల ఆయుధాల కొనుగోలుకు అనుమతులిచ్చారు.ఈ నిధులతో ఇండియన్ ఆర్మీకి సంబంధించి నాగ్ మిసైల్ సిస్టమ్ . నేవీకి సంబంధించి ల్యాండింగ్ ప్లాట్ఫార్మ్ డాక్స్ నిర్మాణం, నావల్ సర్పేస్ గన్, అడ్వాన్స్ లైట్ వెయిట్ టార్పెడో తదితర యుద్ధ సామాగ్రి కొనుగోలుచేయనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. నాగ్ క్షిపణి వ్యవస్థను ఆర్మీ వాహనాలపై మోహరిస్తారు.ఈ క్షిపణులుశత్రు ట్యాంకులు, బంకర్లు మరియు ఇతర బలవర్థకమైన గోడలను నాశనం చేయగలవు. నేవీకి సంబంధించి ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్స్ నిర్మించనున్నారు. సముద్రం నుండి భూమి మీద చేసే దాడులను ఇవి సులభతరం చేస్తాయి. అంతేకాకుండా ఇవి శాంతి పరిరక్షణ కార్యక్రమాలు, ఇతర సహాయం విపత్తు నిర్వహణకు ఉపయోగపడతాయి. వీటితో పాటు నావల్ సర్ఫేస్ గన్ మరియు అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పెడోలను కొనుగోలు చేయనున్నారు. ఇవి ఇది అణు మరియు తేలికపాటి జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకోని దాడి చేయగలవు.ఎయిర్‌ఫోర్స్‌ని ఆధునీకరించడానికి కొలాబరేటివ్ లాంగ్ రేంజ్ టార్గెట్ సాచురేషన్ అండ్ డిస్ట్రక్షన్ సిస్టమ్‌ను కొనుగోలు చేయనున్నారు. ఈ వ్యవస్థ విమానం టేకాఫ్, ల్యాండ్, నావిగేట్, లక్ష్యాలను గుర్తించడంతో పాటు మరియు పైలట్ లేకుండా దాడి చేయడానికి సహకరిస్తుంది. ఈ ఆయుధాల ఆదునీకరణ కేవలం యుద్ధ సమయంలోనే కాకుండా రక్షణ, సహాయక చర్యలు, శాంతి మిషన్లు, విపత్తు నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతాయని అధికారులు పేర్కొన్నారు.అంతేకాకుండా వీటిలో చాలా మట్టుకు భారత్‌లోనే తయారవుతున్నాయని దీనివల్ల మేకిన్ ఇండియాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. -
ఒంటరైన అమర్ నాథ్ రెడ్డి
చిత్తూరు: జిల్లాలోని ఏకైక ఫిరాయింపు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి మంత్రి పదవిపై ఆశలు వదులుకున్నారా? టీడీపీలో ఆయన ఒంటరి అయ్యారా? అధికారులు కూడా ఆయన వినతులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదా? 2019 జరిగే ఎన్నికల్లో కూడా ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదా? ఒకవేళ ఇచ్చినా గెలిచే అవకాశాలు సన్నగిల్లినట్లేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది టీడీపీలోని కొన్ని వర్గాల నుంచి. దీంతోనే దాదాపుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా పలమనేరు ఇన్చార్జ్ సుభాస్ చంద్రబోస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆయన రాజకీయ భవిష్యత్‌పై సందేహ పడుతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వైఎస్సార్సీపీ నుంచి ఆయనతో టీడీపీలో చేరిన కార్యకర్తలు కూడా రెండోరోజు నుంచే ఒక్కొక్కరు ఆయనను వదలి సొంత గూటికే చేరుతున్నారు. అధికారులు కూడా ఆయన చెప్పిన పనులను పక్కన పెడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బోస్‌కే ప్రాధాన్యం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా అధికార టీడీపీ ఆపరేషన్ ఆకర్్షకు తెరలేపింది. ఈ వలలో అమర్నాథ్రెడ్డి తేలికగా పడ్డారు. వైఎస్సార్ సీపీ విప్‌గా ఉంటూనే పార్టీ ఫిరాయించారు. మంత్రిపదవి ఆశ, జిల్లాను మొత్తం శాసించవచ్చనే ఒక కోరికతో ఆయన తెలుగుదేశం గూటికి జంప్ అయ్యారు. పార్టీలో చేరిన కొన్నాళ్లకే అమర్‌కు అసలు తత్వం బోధపడింది. టీడీపీ కేడర్ మొత్తం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బోస్‌కే అండగా నిలుస్తోంది. అధికారులు కూడా బోస్ చెప్పిన పనులకే ‘ఊ ’ కొడుతుండటం కూడా అమర్‌కు మింగుడు పడటం లేదు. తొలిరోజుల్లో ఇలాంటి పరిస్థితులు చూసి తనకు మంత్రి పదవి వస్తే అధికారులు, పార్టీ నాయకులు సరెండర్ అవుతారని అనుచరులతో చెప్పుకునేవారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదని వార్తలు వస్తుండటంతో ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఈ పరిస్థితిని జిల్లా నాయకులకు చెప్పుకుంటే అవహేళన చేస్తారనే ఉద్దేశంతో ఆయన గుంభనంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టే అమర్ పార్టీలోకి వచ్చారని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. కష్టకాలంలో పార్టీని వదలి వెళ్లిన అమర్‌ను ఎంత మాత్రం ప్రోత్సహించమని వారు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. టీడీపీలో చూపించిన బుద్ధే వైఎస్సార్సీపీలోనూ చూపించారని, ఆయన వైఖరే అంత అని పార్టీ అధిష్టానానికి కూడా చేరవేశారని తెలుస్తోంది. తన మనుగడ, స్వప్రయోజాల కోసం పార్టీలోకి తిరిగి వచ్చిన అవకాశవాది అమర్నా«థ్‌రెడ్డికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని టీడీపీ అధిష్టానానికి పలమనేరు కేడర్ కుండబద్ధలు కొట్టినట్లు విశ్వసనీయ సమాచారం.


