అమెరికాలో అక్రమ వలసదారులు.. భారత్ కీలక ప్రకటన | trump immigration crackdown indian nationals deported in 2026 | Sakshi
Sakshi News home page

అమెరికాలో అక్రమ వలసదారులు.. భారత్ కీలక ప్రకటన

Jun 6 2026 3:09 PM | Updated on Jun 6 2026 3:57 PM

trump immigration crackdown indian nationals deported in 2026

ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఎట్టి పరిస్థితుల్లో వారు దేశంలోకి ఉండనిచ్చేది లేదంటూ ఎన్నో కఠిన నిబంధనలు తీసుకవచ్చి వారిని దేశం నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలోనేఅమెరికా నుంచి దేశ బహిష్కరణకు గురైన వారి వివరాలు భారత్ ప్రకటించింది. 

భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అమెరికా నుంచి దేశ బహిష్కరణకు గురైన వారి వివరాలు ప్రకటించారు. "2026లో ఇప్పటివరకూ 1,076 మంది బహిష్కరణకు గురయ్యారు. అదే గతేడాది మెుత్తంగా 3,567 మంది బహిష్కరణకు గురయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా ఉంది. అయినప్పటికీ ఇది అధికమే" అని జైశ్వాల్ అన్నారు. దేశ బహిష్కరణకు గురైన వారిలో సరైన పత్రాలు లేకపోవడంతో పాటు వీసా ఉల్లంఘనలకు పాల్పడిన వారు ఉన్నారని పేర్కొన్నారు.

అక్రమ వలసల విషయమై భారత్, అమెరికా దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని అక్రమ వలసలను ఎలా అరికట్టాలి, అదే సమయంలో ఇది చట్టబద్ధమైన వలసలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఎలా చూసుకోవాలి అనే దానిపై ఇరుదేశాలు దృష్టి సారించాయనిపేర్కొన్నారు. 

కాగా ఈ వారంలోనే భారత్‌కు చెందిన సుమారు 30 మంది వ్యక్తులు వాణిజ్య ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తూ అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు గుర్తించారు . వీరిని త్వరలోనే దేశ బహిష్కరణకు గురిచేసే అవకాశం ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement