కథలు అల్లకండి.. డీకే శివకుమార్ వార్నింగ్ | ramalinga reddy resignation ministers on whatsapp dk | Sakshi
Sakshi News home page

కథలు అల్లకండి.. డీకే శివకుమార్ వార్నింగ్

Jun 6 2026 4:52 PM | Updated on Jun 6 2026 6:07 PM

ramalinga reddy resignation ministers on whatsapp dk

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే ఊహించని షాక్ తగిలింది. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో డీకే శివకుమార్‌పై విమర్శలు రావడంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని అనవసర కథనాలు సృష్టించకూడదని వార్నింగ్ ఇచ్చారు.

కొత్తగా కొలువుదీరిన శివకుమార్ ప్రభుత్వానికి ఆదిలోనే ఆటంకం ఎదురైంది. సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి తన మంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో ముఖ్యమంత్రి తనకు బెంగళూరు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ప్రమాణ స్వీకారం తర్వాత నీటిపారుదల మంత్రిత్వ శాఖను కేటాయించారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి మాట తప్పినందుకు గానూ తన మంత్రిత్వ శాఖకు రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

దీంతో శివకుమార్ డ్యామేజ్‌ కంట్రోల్‌ పనులు చేపట్టారు. ఆయన రాజీనామాపై స్పందిస్తూ "రామలింగారెడ్డి నాకు ‍అత్యంత సన్నిహితుడు తన అత్యంత సన్నిహితుడు సమస్యలన్నీత్వరలోనే పరిష్కారమవుతాయి. అనవసరమైన కథలు సృష్టించకండి అవన్నీ నిరాధారమవుతాయి.ఇప్పుడు సమస్యలన్నీ సర్ధుకున్నాయి" అన్నారు. అతను వాట్సాప్‌లో రాజీనామా పంపాడని పేర్కొన్నారు.

కాగా నిన్న (శుక్రవారం) రాత్రి, రామలింగారెడ్డి రాజీనామా అనంతరం శివకుమార్ ఆయనతో రెండు గంటల పాటు సమావేశమయ్యారు.ఆయనతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ విధంగా మాట్లాడారు. కాగా డీకే శివకూమార్‌ క్యాబినేట్ బెర్తులపై మరో మంత్రి కేఎం మునియప్ప సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఉన్న తనకు మరింత మెరుగైన క్యాబినేట్‌ దక్కాల్సిందన్నారు. ప్రస్తుతం ఆయనకు సివిల్‌ సప్లైస్‌ మంత్రిత్వశాఖ కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement