 
													నలంద/లఖీసరాయ్: బిహార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం«దీని బీజేపీ అగ్రనేత అమిత్ షా లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘ఛాత్ పండుగ వేళ ఛాత్‌మాతను ప్రారి్థస్తున్నట్లు ప్రధాని మోదీ నాటకం ఆడుతున్నారని రాహుల్ బాబా ఆరోపించారు. ఇటలీ మూలాలున్న రాహుల్ గాంధీకి భారతీయ సనాతన విశ్వాసాలను పొగిడేంత కనీసం అర్హత కూడా లేదు. గతంలోనూ మోదీ తల్లిని కాంగ్రెస్ నేతలు అవమానించారు.
ఈ అవమానాలకు బదులు తీర్చేకునేలా ఈవీఎం బటన్లపై ఎన్‌డీఏ గుర్తులున్న చోట్ల శక్తిమేరకు గట్టిగా ఒత్తండి. ఎంత బలంగా ఒత్తాలంటే ఆ ధాటికి ఇటలీలో భూప్రకంపనలు రావాలి’’అని అన్నారు. కాంగ్రెస్‌పైనా అమిత్ విమర్శలు గుప్పించారు. ‘‘ఐదు శతాబ్దాల అయోధ్య నిర్మాణ కలను కాంగ్రెస్ 70 ఏళ్లు అధికారంలో ఉండి కూడా సుసాధ్యం చేయలేకపోయింది.
నలందలో ఆధునిక విశ్వవిద్యాలయాన్ని మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. గతంలో మాదిరి ఆనాటి జ్ఞానభాండాగారాలను ఏ ముఖ్తియార్ ఖిల్జీ కూడా నాశనంచేయలేడు’’అని అమిత్ వ్యాఖ్యానించారు. తారాపూర్‌లో బీజేపీ అభ్యరి్థ, ప్రస్తుత డెప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి త్వరలో సీఎం అయ్యే అవకాశాలున్నాయని అమిత్ పరోక్ష వ్యాఖ్యలుచేశారు. ‘‘చౌదరికి ఓటేయండి. త్వరలో ప్రధాని మోదీ ఈయనకు పెద్ద బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు’’అని అన్నారు.  
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
