Assembly ByPolls: జేకేలో బీజేపీ, పంజాబ్‌లో అకాలీదళ్‌ ముందంజ | Bihar And 8 Other Assembly Election Results Key Trends Live Updates In Telugu, BJP Ahead In Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

Assembly ByPolls Results: జేకేలో బీజేపీ, పంజాబ్‌లో అకాలీదళ్‌ ముందంజ

Nov 14 2025 9:54 AM | Updated on Nov 14 2025 11:02 AM

Assembly ByPolls Result Live Updates BJP Ahead In JK

న్యూఢిల్లీ: బీహార్‌ అసెంబ్లీ ఎ‍న్నికలతో పాటు దేశంలోని మరో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయ. ప్రారంభ ట్రెండ్‌లను పరిశీలిస్తే కీలక పార్టీలు తొలి ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని నగ్రోటా ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి దేవయాని రాణా ప్రస్తుతం 1,111 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. జమ్ముకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీకి చెందిన హర్ష్ దేవ్ సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన షమీమ్ బేగం కంటే ఆయన ముందంజలో కొనసాగుతున్నారు.

మరోవైపు జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన అగా సయ్యద్ మహమూద్ అల్ మోసావి..  బుడ్గామ్‌లో 624 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మిజోరంలోని డంపా అసెంబ్లీ ఉప ఎన్నికలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) తొలి ఆధిక్యంలో ఉంది. అభ్యర్థి డాక్టర్ ఆర్ లాల్తాంగ్లియానా 170 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం జోరాం పీపుల్స్ మూవ్‌మెంట్ వన్‌లాల్‌సైలోవా, బీజేపీకి చెందిన లాల్‌మింగ్‌తంగా కంటే ముందంజలో ఉన్నారు.

పంజాబ్‌లోని తర్న్ తరన్ ఉప ఎన్నికలో, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) అభ్యర్థి సుఖ్‌విందర్ కౌర్ 625 ఓట్ల ఆధిక్యంతో ఆధిక్యంలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌)హర్మీత్ సింగ్ సంధు..  కాంగ్రెస్ పార్టీ కరణ్‌బీర్ సింగ్  కంటే ముందంజలో ఉన్నారు. జమ్ముకశ్మీర్ (బుద్గాం, నగ్రోటా), రాజస్థాన్ (అంటా), జార్ఖండ్ (ఘట్‌శిల), తెలంగాణ (జూబ్లీ హిల్స్), పంజాబ్ (తర్న్ తరన్), మిజోరం (దంపా), ఒడిశా (నువాపాడా)లలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు జరిగాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement