సోలన్ జిల్లా: హిమాచల్ ప్రదేశ్‌లో పేలుడు సంభవించింది. సోలన్ జిల్లాలోని నాలాగఢ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి భవనాలు దెబ్బతిన్నాయి. పీఎస్‌లో ఇన్వెస్టిగేషన్ రూమ్ కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. 40 నుండి 50 మీటర్ల వరకు ఈ పేలుడు ప్రభావం చూపించింది. పేలుడు తీవ్రతకు రంధ్రం ఏర్పడింది. సమీపంలోని కొన్ని చెట్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే, పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు.
బద్ది ఎస్పీ వినోద్ దీమాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పేలుడు పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలంలో జరిగిందని.. అది పోలీస్ శాఖకు చెందిన స్థలం కాదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో చెత్తాచెదారం పేరుకుపోయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ఎవరు గాయలేదని ఎస్పీ తెలిపారు.


