ఓరీ నా కొడకో.. నీకు ఎంత కష్టం వచ్చిందిరో అంటూ ఆ తల్లి పరిగెత్తుకుంటూ కొడుకు బెడ్‌రూమ్ వైపు గబగబా పరుగులు తీసింది. అక్కడ కనిపించిన దృశ్యంతో ఆమె, గ్రామస్తులు షాక్ తిన్నారు. అతన్ని ఓ మంచానికి కట్టేసింది అతని భార్య. ముదనష్టపుది అంటూ కోడలి గురించి గొణుక్కుంటూనే ఆ అత్త పెద్దమనుషుల సాయంతో కొడుకు చేతులకు కట్టిన తాడుల్ని విడిపించింది. ఇక్కడి నుంచి అసలు హైడ్రామా నడిచింది..
ఉత్తర ప్రదేశ్ అలీగఢ్‌లో నేరుగా బెడ్‌రూమ్ నుంచి టప్పల్ పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయితీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన కొడుకును కోడలు హింసిస్తోందని.. తాజాగా మంచానికి కట్టేసిందని.. గట్టిగా మందలిస్తే తనకు తుపాకీ చూపించిందంటూ ఓ ఫొటోను పోలీసులకు అందించిందా అత్త. అందులో కోడలు యిస్టైల్‌గా పిస్టల్‌తో ఫోజు ఇచ్చింది.
దీంతో.. కోడలిని పీఎస్‌కు పిలిపించుకున్న పోలీసులు అసలు విషయంపై ఆరా తీశారు. అయితే తాను అలా చేయడానికి బలమైన కారణం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. రోజూ తాగి వచ్చి తన భర్త ప్రదీప్ తనను హింసిస్తున్నాడని.. ఇరుగుపొరుగువాళ్లనూ బండ బూతులు తిడుతున్నారని సోనీ వాపోయింది. నాలుగేళ్ల కిందట తమ వివాహం అయ్యందని.. గత రెండేళ్లుగా కట్నం కోసం వేధిస్తూ వస్తున్నాడని చెప్పింది. ఈ క్రమంలోనే తాగుబోతు భర్త తీరుతో విసిగిపోయి అలా మంచానికి కట్టేశానని చెప్పిందామె.
అదే సమయంలో ఆ తుపాకీ నకిలీదని తేలింది. దీంతో ఆ అత్త షాక్ తింది. దీంతో.. ఆ అత్తాకోడళ్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే.. నెట్టింట ప్రదీప్‌ను మంచానికి కట్టి అత్తతో సోని గొడవపడుతున్న వీడియో వైరల్ అవుతోంది.
UP Woman Ties Husband To Bed, Mother-In-Law Shows Cops Her Pic With Gun https://t.co/8I6zGHEmMl pic.twitter.com/uCp3h2XqJK
— NDTV (@ndtv) January 23, 2026


