చెన్నై: రామనాథపురం జిల్లా పరమకుడిలో శనివారం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అమరవీరుడు ఇమాన్యుయేల్ శేఖరన్ మణి మండపాన్ని ప్రారంభించడానికి వచ్చారు. ఆయన భద్రతా విధుల కోసం రామనాథపురం, శివగంగై, విరుదునగర్, నెల్లై, తూత్తుకుడి, తంజావూరు వంటి వివిధ జిల్లాల నుంచి పురుష, మహిళా పోలీసు అధికారులు అక్కడికి వచ్చారు.ఈ స్థితిలో, తంజావూరు నుంచి మహిళా పోలీసు అధికారులను పరమకుడిలోని మణినగర్ ప్రాంతంలోని అవుట్‌పోస్ట్ చెక్ పోస్ట్ వద్ద మోహరించారు.
పరమకుడి నగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న స్పెషల్ సబ్–ఇన్‌స్పెక్టర్ ముత్తుపాండిని కూడా భద్రతా పనుల కోసం నియమించారు. ఈ అవుట్‌పోస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఓ టాయిలెట్ ఉంది. భద్రతా విధుల్లో ఉన్న తంజావూరుకు చెందిన మహిళా పోలీసులకు ఈ టాయిలెట్‌ను కేటాయించారు. అందులోకి వెళ్లిన సమయంలో కొంతమంది మహిళా పోలీసు అధికారులు టాయిలెట్‌లో దాచిన సెల్‌ఫో¯న్‌ను చూసి అనుమానం వ్యక్తం చేశారు. తరువాత, వారు దానిని బయటకు తీసినప్పుడు, అది వీడియో రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించారు. మహిళా పోలీసు అధికారులు టాయిలెట్‌లోకి ప్రవేశించే దృశ్యాలు అందులో ఉండడం చూసి వారు దిగ్భ్రాంతి చెందారు.
వెంటనే వారు సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకుని పరమకుడి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. అది స్పెషల్ సబ్–ఇ¯న్‌స్పెక్టర్ ముత్తుపాండి సెల్ ఫోన్ అని తేలింది. దర్యాప్తులో, స్పెషల్ సబ్–ఇన్‌స్పెక్టర్ ముత్తుపాండి ఎవరూ లేని సమయంలో టాయిలెట్‌లోకి వెళ్లాడని, ఆపై తన సెల్ ఫో¯న్‌లో వీడియోను ఆన్ చేసి ఎవరికీ తెలియకుండా ఒక ప్రదేశంలో దాచాడని తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి స్పెషల్ సబ్–ఇ¯న్‌స్పెక్టర్ ముత్తుపాండిని ఆదివారం అరెస్టు చేసి రామనాథపురం జైలుకు తరలించారు.


