న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ 45,000కుపైగా బూత్‌ల్లో ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రీపోలింగ్ కోసం ఎలాంటి ప్రతిపాదన చేయలేదని శుక్రవారం వెల్లడించింది. ఎక్కడా రీపోలింగ్ అవసరం రాలేదని పేర్కొంది. తొలి దశలో పోలింగ్ జరిగిన 121 నియోజకవర్గాల్లో సంబంధిత డాక్యుమెంట్ల సూక్ష్మపరిశీలన పూర్తయినట్లు తెలియజేసింది. ఎన్నికల నిర్వహణలో లోపాలు గానీ, అవకతవకలు గానీ జరిగినట్లు నిరూపణ కాలేదని స్పష్టంచేసింది. అందుకే రీపోలింగ్ కోసం ప్రతిపాదించలేదని ఎన్నికల సంఘం వివరించింది.


