ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో ఆర్కే సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ.. షోకాజ్ నోటీసు జారీ చేసింది. బీహార్‌లో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తిరుగుబాటు నేతలపై బీజేపీ దృష్టి సారించింది.
బీహార్‌కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఆర్.కే. సింగ్ సహా ముగ్గురు నేతలపై సస్పెన్షన్ వేటు వేసింది. వారిని పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో వారం లోపు వివరణ ఇవ్వాలంటూ కూడా ముగ్గురు నేతలకు బీజేపీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వారి వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని నోటీసులో బీజేపీ పేర్కొంది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగానే శాసనమండలి సభ్యుడు అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్, కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ అధిష్ఠానం స్పష్టం చేసింది. ఆర్కే సింగ్.. మోదీ సర్కార్‌పై విద్యుత్ మంత్రిగా, మాజీ కేంద్ర హోం కార్యదర్శిగా చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పించారు.


