కాకినాడ: ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాటలు మాత్రం కోటలు దాటుతూనే ఉన్నాయి కానీ చేతలు మాత్రం ఇళ్లు దాటడం లేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. గత ఏడాదిగా పాలన గాలికొదిలేసి.. అరాచకం, విధ్వంసం, మోసం, వంచన, క్రెడిట్ చోరీతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఈరోజు(శుక్రవారం, జనవరి 2వ తేదీ) కాకినాడ నుంచి మాట్లాడిన కురసాల.. ‘చంద్రబాబు, లోకేష్ పాలన గాలికి వదిలేసి విదేశి పర్యాటనలకు వెళ్ళారు.
అధికారంకంగా వెళ్తున్నామా? వ్యక్తిగతంగా వెళ్ళారో ఎవరికి తెలియదు. ప్రజల్ని ఎందుకు ఇంత అయోమంకు గురి చెసి... పర్యటనలను రహస్యంగా ఉంచారు. వైఎస్ జగన్ గతంలో తన కుమార్తె దగ్గరకు లండన్ వెళ్తే లోకేష్ ఎంతో హేళన చేశారు. నోరు విప్పితే చంద్రబాబు, లోకేష్ అబద్దాలు. .పిట్ట కధలు వల్లిస్తారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అప్పులు చేసేస్తున్నారని టిడిపి వీపరితమైన ప్రచారం చేసింది.గత 18 నెలల కాలంలో అత్యధిక అప్పులు కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆర్బీఐ చెబుతోంది.
ఇప్పటి వరకు చంద్రబాబు రూ.2.9 లక్షలు కోట్లు అప్పు చేశారు. సంపద సృష్టి లేదు..ఉద్యోగ కల్పన లేదు.. పారిశ్రామిక వేత్తలు రావడం లేదని ఆబద్దాలను ప్రజల మీదకు వదులుతున్నారు. ఆర్బీఐ నివేదిక ఆధారంగా వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌కి ఇప్పటి వరకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు. 2019-24 లో తయారీ రంగంలో సౌత్ లో మొదటి స్ధానంలోను, దేశంలో ఐదవ స్ధానంలో ఉందని ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. ఈ ఎనిమిది నెలల కాలంలో జిఎస్టీ 3.48% పెరిగింది. సగటున 10% పెరగాలి. స్టేట్ సేల్స్ టాక్స్ పడిపోయింది. ఊళ్ళల్లో నిర్మాణ పనులు జరగడం లేదు. పండుగ పూట రోడ్లు, దుకాణాలు కాళీగా ఉన్నాయి.

చంద్రబాబు చేసిన అప్పుల సొమ్ములను ఏం చేశారు?, పధకాలు అమలు చేయడం లేదు...ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదు. దేశ విదేశాలకు పాఠాలు చెబుతాననే చంద్రబాబు. ఏపీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పలేకపోతున్నాడు. అమరావతి రైతులు చంద్రబాబు ద్రోహనికి బలైపోయే రోజులు వస్తాయి. ఈ ఏడాదిన్నర కాలంలో అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుండి ఒక్క గ్రాంట్ తీసుకువచ్చారా?, అమరావతిలో వందల కోట్లతో నీళ్లు తోడుతున్నారు. అమరావతి రైతు చనిపోతే చంద్రబాబుకు చీమ కుట్టినట్లు లేదు. రైతు కూల్‌గా మాట్లాడి చనిపోయాడని అబద్దపు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.


