పాట్నా: గోరుచుట్టుపై రోకటి పోటులా అన్న చందంగా తయారైంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ ఘోర పరాభవంతో సతమతమవుతున్న లాలూకు ఇప్పుడు కుటుంబ వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం లాలూ కుమార్తె, ఆర్జేడీ నేత రోహిణి ఆచార్య రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో తన కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశారు. ‘తేజస్వీ ఆయన సహాయకులే నన్ను బయటకు పంపారు. అసభ్యకరంగా తిట్టారు. చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించారు. నా ఆత్మగౌరవం విషయంలో నేను రాజీపడను. నన్ను అనాథను చేశారని అన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం తరువాత ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ (ఆర్జేడీ) ఇలా ఎందుకు ఓడిపోయింది? అని. ఈ పరాజయానికి కారణం ఎవరు? కానీ మీరు సంజయ్ యాదవ్, రమీజ్ పేర్లు తీస్తే చాలు.. వెంటనే ఇంటి నుంచి బయటకు తోసేస్తారు. అవమానిస్తారు, దుర్భాషలాడతారు. నన్ను కూడా అలాగే చేశారు. నన్ను కుటుంబం నుంచి బహిష్కరించారు.
నాకంటూ కుటుంబం లేదు. మీరు ఏదైనా అడగాలి అనుకుంటే తేజస్వీ యాదవ్, సంజయ్ యాదవ్, రమీజ్ అడగండి. వాళ్లందరూ ఒక్కటై.. నన్ను నా కుటుంబం నుంచి వేరు చేశారు’ అని సింగపూర్ వెళుతూ పాట్నా ఎయిర్‌పోర్టులో మీడియా ఎదుట వాపోయారు.

కుటంబంలో కిడ్నీ చిచ్చు
2022లో తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు రోహిణీ ఆచార్య కిడ్నీ దానం చేశారు. రోహిణీ వాస్తవానికి కిడ్నీ దానం చేయలేదనే ఆరోపణలు,పుకార్లు లాలూ కుటుంబసభ్యుల మధ్య చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది.ఇదే అంశంపై రోహిణీ ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌లో ‘నా తండ్రికి కిడ్నీ దానం చేసి నేను చెడ్డదాన్నయ్యాను. నా అనుకున్న నా వాళ్లే నాపై దూర్భషలాడారు. నా మురికి కిడ్నీని నాన్నకు మార్పిడి చేయించానని, ప్రతి ఫలంగా కోట్ల రూపాయల డబ్బుతో పాటు ఎంపీ టికెట్‌ను తీసుకున్నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నేను పాపం చేశాను. నా భర్త, నా ముగ్గురు పిల్లల కంటే నా తండ్రే నాకు ఎక్కువ అనుకున్నా. అందుకే నా తండ్రికి కిడ్నీ దానం చేయాల్సి వస్తే నా భర్తను,పిల్లల్ని,నా అత్తమామల అనుమతి కూడా తీసుకోలేదు. నా దేవుడు, నా తండ్రి లాలూని కాపాడుకోవడానికి కిడ్నీ ఇచ్చాను. అలలాంటి ఇప్పుడు వాళ్లకు నేను చెడ్డదాన్నయ్యాను’ అని ట్వీట్‌లో విచారం వ్యక్తం చేశారు.
కాగా లాలూ కుటుంబంలో తాజాగా పరిణామాలు బిహార్ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. రోహిణి ఆచార్య ఆరోపణలు, ఆమె కుటుంబంతో విభేదాలు, పార్టీ పరాజయం ఇవన్నీ కలిపి ఆర్జేడీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
রোহিনী আচার্যকে ত্যাজ্য করার অভিযোগ যাদব পরিবারের বিরুদ্ধে | Rohini Acharya#rjd #rjdnews #biharelection2025 #biharelectionresults #biharnews #laluprasadyadav #tejashwiyadav #eisamay #eisamayonline pic.twitter.com/fvSRBJsjU6
— Ei Samay (@Ei_Samay) November 16, 2025


