Bihar Elections Votes Counting Live: మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసిన ఎన్డీయే! | Bihar Assembly Election Results 2025 Votes Counting And Leading Live Updates Telugu, Constituency-wise Final Results | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

Bihar Elections Votes Counting Live: మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసిన ఎన్డీయే!

ఆధిక్యంలోనే ఎన్డీయే కూటమి

  • బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే హవా
  • ఎన్నికల కౌంటింగ్‌లో దూసుకుపోతున్న ఆ కూటమి అభ్యర్థులు
  • 151 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థుల లీడ్‌
  • 79 స్థానాల్లో ఆధిక్యంలో మహాఘట్‌ బంధన్‌ అభ్యర్థులు
  • లీడ్‌ నుంచి జన్‌ సురాజ్‌ అభ్యర్థులు అవుట్‌(0)
  • ఇతరులు 11 స్థానాల్లో అధిక్యం
2025-11-14 09:59:20

బీహార్‌లో ఎన్డీయే హవా

  • బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే హవా
  • మ్యాజిక్‌ ఫిగర్‌ 122 దాటేసిన అధికార కూటమి
  • 150కి పైగా స్థానాల్లో ఆధిక్యం
  • 75 స్థానాల్లో ఆధిక్యంలో మహాఘట్‌బంధన్‌

 

2025-11-14 09:44:01

ఆధిక్యంలో కీలక నేతలు..

  • పూర్ణియాలో మంత్రి లేసీ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు.
  • పూర్నియా స్థానాల ప్రారంభ ధోరణులలో ధమ్దాహా అసెంబ్లీ నుండి మంత్రి లేసే సింగ్ ఆధిక్యం.
  • బైసీ అసెంబ్లీ నుండి ఆర్జేడీ అభ్యర్థి అబ్దుస్ హాజీ సుభాన్,
  • రూపౌలి నుండి జేడీయూ అభ్యర్థి కాలాధర్ మండల్,
  • పూర్నియా సదర్ అసెంబ్లీ నుండి బీజేపీ అభ్యర్థి విజయ్ ఖేమ్కా ఆధిక్యం.
  • బన్మాంఖి అసెంబ్లీ నుండి బీజేపీ అభ్యర్థి కృష్ణ రిషి ఆధిక్యం.
2025-11-14 09:37:20

ఎవరు ముందున్నారు?

  • ముందంజలో కీలక నేతలు..
  • ఎవరు ముందున్నారు మరియు పెద్ద ముఖాల వెనుక ఎవరు ఉన్నారు?
  • తారాపూర్‌లో బీజేపీ అభ్యర్థి సామ్రాట్ చౌదరి వెనుకబడి ఉన్నారు.
  • లఖిసరాయ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయ్ సిన్హా ఆధిక్యంలో ఉన్నారు.
  • తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి ఆధిక్యంలో ఉన్నారు.
  • ఛప్రా నుంచి ఆర్జేడీ అభ్యర్థి ఖేసరి లాల్ ఆధిక్యంలో ఉన్నారు.
  • దానాపూర్‌లో ఆర్జేడీ అభ్యర్థి రీత్లాల్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.
  • బాహుబలి కూతురు, ఆర్జేడీ అభ్యర్థి శివానీ లాల్ గంజ్ నుంచి ఆధిక్యంలో ఉన్నారు
  • మహువా కంటే తేజ్ ప్రతాప్ ముందున్నారు
2025-11-14 09:31:47

దూసుకెళ్తున్న ఎన్డీయే కూటమి..

  • ఎన్డీయే-142
  • మహా కూటమి-72
  • జన్‌సూరజ్‌-2
  • ఇతరులు-3
2025-11-14 09:29:21

మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఎన్డీయే

  • మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఎన్డీయే కూటమి
  • కొనసాగుతున్న కౌంటింగ్‌
  • ఎన్డీయే-134
  • ఎంజీబీ-66
  • జన్‌సూరజ్-3
2025-11-14 09:16:59

హాఫ్‌సెంచరీ లీడ్‌ దాటేసిన ఎన్డీయే

  • బిహార్‌ ఫలితాల్లో ఆధిక్యంలో ఎన్డీయే
  • 243కిగానూ.. 99 స్థానాలకు సంబంధించిన ఎర్లీ ట్రెండ్స్‌ వెల్లడి
  • 63 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోన్న ఎన్డీయే అభ్యర్థులు
  • 34 స్థానాల్లో మహాగఠ్‌బంధన్‌ కూటమి అభ్యర్థులకు ఆధిక్యం
  • రెండు స్థానాల్లో పీకే జన్‌ సురాజ్‌ అభ్యర్థులు
2025-11-14 08:47:40

పోస్టల్‌ బ్యాలెట్‌లో ఎన్డీయే కూటమి ముందంజ

  • పోస్టల్‌ బ్యాలెట్‌లో ఎన్డీయే కూటమి ముందంజ
  • 36 స్థానాల్లో ఎన్డీయే, 12 స్థానాల్లో మహాగఠ్‌బంధన్‌ కూటమి అభ్యర్థుల ఆధిక్యం
2025-11-14 08:47:40

ఆధిక్యంలోకి వచ్చిన తేజ్‌ ప్రతాప్‌

  • మహువాలో తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ ముందంజ
  • ‘జనశక్తి జనతా దళ్‌’ పేరుతో కొత్త పార్టీ పెట్టి బరిలోకి దిగిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు
  • రాఘోపుర్‌లో లాలూ మరో తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ముందంజ
  • అలీనగర్‌లో ఒక్కసారిగా వెనకబడి.. మళ్లీ లీడ్‌లోకి వచ్చిన బీజేపీ అభ్యర్థి సింగర్‌ మైథిలీ ఠాకూర్‌
2025-11-14 08:47:40

ఎర్లీ లీడ్స్‌.. ఎన్డీయే ముందంజ

  • ఎర్లీ లీడ్స్‌లో ఎన్డీయే అభ్యర్థుల హవా
  • 30 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యం
  • మహాఘట్‌ బంధన్‌ 20 స్థానాల్లో ఆధిక్యం
  • మహువాలో తేజ్‌ ప్రతాప్‌ వెనకంజ
  • శివాన్‌లో బీజేపీ అభ్యర్థి మంగళ్‌పాండే ముందంజ
  • అలీపూర్‌లో ముందంజలో మైథీలీ ఠాకూర్‌
  • తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌద్రీ ముందంజ
  • రాఘోపూర్‌లో ఆధిక్యంలో తేజస్వి యాదవ్‌
2025-11-14 08:31:20

కొనసాగుతున్న బిహార్‌ కౌంటింగ్‌

  • కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌
  • ముందంజలో ఎన్డీయే మిత్రపక్షాలు, వెనుకబడ్డ మహాఘట్‌ బంధన్‌
  • రెండు స్థానాల్లో ప్రశాంత్‌ కిషోర్‌ జన్‌ సురాజ్‌ లీడ్‌
2025-11-14 08:25:54

పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ముందంజ

  • పోస్టల్‌ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ముందంజ
  • రాఘోపూర్‌లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ముందంజ
  • మరికాసేపట్లో ఈవీఎంల లెక్కింపు ప్రారంభం
2025-11-14 08:16:45

పేపర్ బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేస్తున్న సిబ్బంది

  • బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
  • తొలుత పోస్ట‌ల్ బ్యాలెట్ లెక్కింపు
  • పేపర్ బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేస్తున్న సిబ్బంది
  • హోమ్ ఓటింగ్ ద్వారా వేసిన 101 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
  • హోమ్ ఓటింగ్ ద్వారా 101 ఓట్లు వేసిన వృద్ధులు, వికలాంగులు
  • ఉ.8.30 నుంచి ఈవీఎం కౌంటింగ్ ప్రారంభం
  • మొత్తం కౌంటింగ్‌కు 4,372 టేబుళ్ల ఏర్పాటు
  • ప్ర‌తి రౌండ్ ముగిసిన వెంట‌నే ఆ రౌండ్ రిజల్ట్
2025-11-14 08:03:14

బిహార్‌ జడ్జిమెంట్‌ డే

  • బిహార్‌లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు
  • అధికారంలోకి రావడానికి కావల్సిన సీట్లు.. మ్యాజిక్‌ ఫిగర్‌): 122
  • విజయంపై అధికార, ప్రతిపక్షాల ధీమా
  • విజయోత్సవాలకు స్వీట్లతో సహా సిద్ధమైన వైనం
  • పోలింగ్‌ శాతం అధికంగా నమోదు కావడంతో ఫలితాలపై ఉత్కంఠ
2025-11-14 07:28:40

బిహార్‌ ఫలితాల అనౌన్స్‌మెంట్‌ ఇలా..

  • కాసేపట్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
  • తేలనున్న 2,616 మంది అభ్యర్థుల భవితవ్యం
  • ఉ.8గంట‌ల‌కు తొలుత పోస్ట‌ల్ బ్యాలెట్ లెక్కింపు
  • ఉ.8.30 నుంచి ఈవిఎం కౌంటింగ్ ప్రారంభం
  • ఈవీఎం ఓట్ల‌కు, పోలైన ఓట్ల‌కు మ‌ధ్య తేడా ఉంటే త‌ప్ప‌నిస‌రిగా వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు
  • కౌంటింగ్ స‌జావుగా జ‌రిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
  • మొత్తం కౌంటింగ్‌కు 4,372 టేబుళ్ల ఏర్పాటు
  • ప్ర‌తి రౌండ్ ముగిసిన వెంట‌నే ఆ రౌండ్ రిజల్ట్
  • రీ పోలింగ్‌కు ఎలాంటి అభ్యర్థనలు రాలేదని తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం
2025-11-14 07:33:38

బిహార్‌ ఎన్నికల పోలింగ్‌ ఇలా..

  • బీహార్‌ మొత్తం ఓటర్ల సంఖ్య: 7.45 కోట్లు (పురుషులు 3.92 కోట్ల మంది, మహిళలు 3.50 కోట్ల మంది)
  • రెండు విడతల్లో సాగిన ఎన్నికలు
  • రెండు దశల్లోనూ రికార్డు స్థాయిలో ఓట్ల శాతం నమోదు 
  • పురుషుల్లో 62.98 శాతం, మహిళల్లో 71.78 శాతం మంది
  • తొలి దశ పోలింగ్‌: నవంబరు 6న 121 స్థానాలకు పోలింగ్‌  
  • ఓటర్లు: 3.75 కోట్ల మంది; బరిలో నిలిచిన అభ్యర్థులు: 1314 మంది, నమోదైన పోలింగ్ శాతం: 65+
  • రెండో దశ: నవంబరు 11; సీట్లు: 122; ఓటర్లు: 3.70 కోట్ల మంది; అభ్యర్థులు: 1302; పోలింగ్ శాతం 69+
2025-11-14 07:19:22

ఎవరికి వారే.. ధీమా

  • విజయంపై ఎవరికి వారే ధీమా
  • సంబురాలకు సిద్ధమైన ఎన్డీయే శ్రేణులు
  • మోదీ, నితీశ్‌ చిత్రాలతో 500 కేజీల లడ్డూలను సిద్ధం చేయించిన బీజేపీ స్టేట్‌ యూనిట్‌
  • ఐదు లక్షల రసగుల్లాలు, గులాబ్‌ జామూన్‌లు కూడా
  • ఎగ్జిట్‌ పోల్స్‌ను పట్టించుకోబోమంటున్న మహాఘట్‌బంధన్‌
  • అత్యధిక పోలింగ్‌ శాతం నమోదు కావడం.. తమ విజయానికి సంకేతామంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ప్రకటన 
2025-11-14 07:15:39

అధికార-విపక్ష ప్రచారాస్త్రాలు.. ప్రధాన హమీలు

ఎన్డీయే కూటమి.. 

అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాల కల్పన, నీతీశ్ సుపరిపాలన, డబుల్‌ ఇంజిన్‌ సర్కారు తదితర అంశాలు 

లాలూ హయాంలో జంగిల్‌రాజ్‌.. అవినీతి ఆరోపణలు

యువతకు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, 

కోటి మంది మహిళలను ‘లఖ్‌పతి దీదీ’లుగా మార్చడం, 

ఐదేళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటు.
 

మహాగఠ్‌బంధన్‌.. 

ఉపాధి, యువత సమస్యలు, విద్య, ఆరోగ్యం తదితర రంగాలపై దృష్టి 

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), ఓట్ల చోరీ, నీతీశ్‌ సర్కారుపై వ్యతిరేకత, వలసలు

ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ, మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఆర్థిక సాయం వంటి హామీల ప్రకటన

2025-11-14 07:11:34

ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలు

  • ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), 
  • ఓట్ల చోరీ ఆరోపణలు, 
  • నిరుద్యోగం, 
  • వలసలు, 
  • అవినీతి, 
  • అభివృద్ధిలో వెనుకబాటు, 
  • శాంతిభద్రతలు 
2025-11-14 06:59:05

కీలక సీట్లు ఇవే..

  • తేజస్వీ యాదవ్‌- ఆర్జేడీ (రాఘోపుర్‌)
  • సామ్రాట్‌ చౌదరీ- బీజేపీ (తారాపుర్‌) 
  • విజయ్‌ కుమార్‌ సిన్హా- బీజేపీ (లఖిసరాయ్‌) 
  • మైథిలీ ఠాకుర్‌- బీజేపీ (అలీనగర్‌) 
  • ప్రేమ్‌ కుమార్‌ - బీజేపీ (గయా టౌన్‌) 
  • తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌- జేజేడీ (మహువా)
  • బిజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌- జేడీయూ (సుపౌల్‌) 
  • తార్‌కిశోర్‌ ప్రసాద్‌- బీజేపీ (కఠిహార్‌) 
  • రాజేశ్‌ కుమార్‌ - కాంగ్రెస్‌ (కుటుంబ)
2025-11-14 06:52:06

2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలేమో ఇలా..

  • ఎన్డీయే: 125 (బీజేపీ 74, జేడీయూ 43, వీఐపీ 04, హెచ్‌ఏఎం 04)
  • మహాఘట్‌బంధన్‌: 110 (ఆర్జేడీ 75, కాంగ్రెస్‌ 19, సీపీఐ (ఎంఎల్‌)ఎల్‌ 12, సీపీఐ 02, సీపీఎం 02)
  • ఇతరులు: 08 (ఏఐఎంఐఎం 05, బీఎస్పీ 01, ఎల్‌జేపీ 01, స్వతంత్రులు 01)
     
2025-11-14 06:43:31

బిహార్‌ చరిత్రలోనే అత్యధిక ఓటింగ్‌

  • 2025 అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు
  • 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే భారీగా పోలింగ్‌
  • దాదాపు 67.13 శాతం పోలింగ్‌ నమోదు
  • అందుకే విజయంపై ఉత్కంఠ

 

2025-11-14 06:38:09

మరికొన్ని గంటల్లో బిహార్‌ ఫలితం

  • బిహార్‌ ఎన్నికల (Bihar Results) ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
  • ఉదయం 8గం. ప్రారంభం కానున్న కౌంటింగ్‌ 
  • ఇంకొన్ని గంటల్లో తేలిపోనున్న ఫలితాలు
2025-11-14 06:30:12
Advertisement
 
Advertisement
Advertisement