ఢిల్లీ: యాక్సిస్ మై ఇండియా సర్వేలోనూ ఎన్డీఏకే బిహార్ ఓటర్లు పట్టం కట్టబోతున్నట్లు వెల్లడైంది. బిహార్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెలువరించిన ఆ సంస్థ.. ఎన్డీఏ కూటమికి 121 నుంచి 140 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రెండు విడతల్లో జరిగిన బిహార్ ఎన్నికల పోలింగ్ రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదైంది.
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఎక్కువ మంది మహిళలు ఏన్డీఏకి ఓటు వేయగా.. మొదటిసారి ఓటు వేస్తున్న యువత మహాఘాట్‌బంధన్‌ను ఓటు వేసినట్లు వెల్లడైంది. బిహార్ అధికార పీఠం మరోసారి జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)కే దక్కబోతున్నట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి.
ఎన్డీఏ కూటమి- 121 నుంచి 140 స్థానాలు
ఇండియా కూటమి-98 నుంచి 118 స్థానాలు
జన్ స్వరాజ్ పార్టీ- 0 నుంచి 2
ఇతరులు- ఒకటి నుంచి ఏడు స్థానాలు
పార్టీల వారీగా..
బీజేపీ 50 నుంచి 56
జెడియు 56 నుంచి 62
ఎల్ జె పి 11 నుంచి 16
ఇతరులు నాలుగు నుంచి ఏడు
మహాఘాట్ బంధన్
ఆర్జేడీ 67 నుంచి 76
కాంగ్రెస్ 17 నుంచి 21
విఐపీ 3 నుంచి 5
ఇతరులు 10 నుంచి 1


